Israel-Iran Tension: పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం
Israel-Iran Tension Row: పశ్చిమాసియాలో సరికొత్త వార్ మొదలైంది. లెబనాన్‌పై గురి పెట్టి విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ కన్నేసింది. అర్థరాత్రి క్షిపణులు వర్షం కురిపించింది.
Israel-Iran Tension Row: పశ్చిమాసియాలో అల్లకల్లోలం మళ్లీ మొదలైంది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారంగా ఇరాన్ రెచ్చిపోయింది. ఇజ్రాయెల్‌పై మిసైళ్లతో విరుచుకుపడింది. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాంబుల వర్షం కురిపించింది.వైమానిక స్థావరాలు, ఆర్మీ క్యాంపులు, వాణిజ్య భవనాలు, ఇలా మెయిన్ ప్రాంతాలను టార్గెట్ చేసుకుంది. విడతల వారీగా దాదాపు నాలుగు వందలకుపైగా మిసైళ్లు ప్రయోగించింది.
ఇస్మాయిల్ హనియే, సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్‌ఫోరోషన్ హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ఇరాన్ చెబుతోంది. అక్రమించుకున్న భూభాగాలను లక్ష్యంగా చేసుకుంది. ఓల్డ్ జెరూసలేంలోని యూదులు, ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. పౌరుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఈ దాడికి పర్యవసానాలను ఇరాన్‌కు చవిచూడాల్సి వస్తుందని IDF అధికార ప్రతినిధి హెచ్చరించారు.
RAW FOOTAGE: Watch as Iranian missiles rain over the Old City in Jerusalem, a holy site for Muslims, Christians and Jews.
— Israel Defense Forces (@IDF) October 1, 2024
This is the target of the Iranian regime: everyone. pic.twitter.com/rIqUZWN3zy
ఇజ్రాయెల్‌లోని ఎల్'అవీవ్‌లో ఉగ్రవాదుల దాడి, 10 మందికి గాయాలు
ఇరాన్ క్షిపణి ప్రయోగానికి కంటే ముందు కొంతమంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తులు M-16, ఏకే 47 తో ప్రజలపై కాల్పులు జరిపారు.
అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.
మంగళవారం సాయంత్రమే ఇలాంటి దాడి జరగవచ్చని అమెరికా హెచ్చరించింది. ఆ హెచ్చరిక వచ్చిన గంటల్లోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు 'ఏపీ' వార్తా సంస్థకు తెలిపారు. ఆలా జరిగితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది అమెరికా. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు ముందే సమాచారం అందిందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు 'AFP'కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా వివరించారు. కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి దాడుల నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా, దాని ఇతర పశ్చిమ మిత్రదేశాలు సహాయం చేశాయని తెలిసిందే.
లెబనాన్‌లోని పౌరులపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ను తమ చీఫ్ హసన్ నస్రల్లాకు అంకితం ఇస్తున్నట్టు కూడా వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఏమి చెప్పింది?
ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఎలాంటి వైమానిక ముప్పు లేదని, అయితే తమ ప్రజలను రక్షించుకోవడానికి, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇంతలోనే టెల్ అవీవ్ సమీపంలోని వైమానిక స్థావరంపై క్షిపణీ ప్రయోగం జరిగినట్టు హిజ్బుల్లా ప్రకటించింది. టెల్ అవీవ్ శివార్లలో ఉన్న సెడ్ డోవ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ...'గతంలో ఇలాంటి బెదిరింపులు చూశాం. ఎదుర్కొన్నాం. భవిష్యత్తులో ఎదుర్కొంటాం. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది. మిత్రదేశమైన అమెరికాతో కలిసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం. అన్నారు. మరోవైపు లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
“Iran’s attack is a severe and dangerous escalation. There will be consequences…We will respond wherever, whenever and however we choose, in accordance with the directive of the government of Israel.”
— Israel Defense Forces (@IDF) October 1, 2024
Watch IDF Spokesperson RAdm. Daniel Hagari regarding Iran’s large-scale… pic.twitter.com/A8pyC7eawI
భారత్ అప్రమత్తం
పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని భారతీయులకు సూచించింది. సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని హితవుపలికింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. ఏదైనా అత్యవసరమైతే... 24/7 పని చేసే +972-547520711, +972-543278392 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.