Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అదరగొడుతున్న 'పుష్ప 2' మూవీకి మలయాళంలో మాత్రం దారుణమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్‌ను మల్లు అర్జున్ అని అభిమానించే కేరళలో ఎందుకు ఆ పరిస్థితి?
అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప 2 : ది రూల్ '. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2021లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'పుష్ప' మూవీకి సీక్వెల్. భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ దాదాపు 829 కోట్లకు పైగా కలెక్షన్స్ లో రాబట్టి మాస్ జాతర చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 900 మార్క్ ను పుష్ప రాజ్ దాటినట్టుగా తెలుస్తోంది.
'పుష్ప 2' ఇప్పుడు కలెక్షన్స్ 55% తగ్గినప్పటికీ, మొదటివారం భారీగానే కలెక్షన్లను కొల్లగొట్టి. సోమవారం నాటికి ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 604.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. వాటిలో తెలుగులో 14 కోట్లు, తమిళంలో 3 కోట్లు, హిందీలో 46 కోట్లు, కన్నడలో 50 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు, హిందీ భాషల్లోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నిజానికి అందరి దృష్టి ఈ సినిమా మలయాళ కలెక్షన్స్ పైనే ఉంది.
అల్లు అర్జున్ కు మలయాళ భాషలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో 'పుష్ప 2' మూవీ అక్కడ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అక్కడ జరిగిన 'పుష్ప 2' మూవీ ఈవెంట్ కి జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఈ సినిమా మలయాళ భాషలో దారుణమైన కలెక్షన్స్ ను చూస్తోంది. మొత్తం 5 రోజులకు గాను 'పుష్ప 2' మూవీ మలయాళ వర్షన్ కేవలం రూ.11.5 కోట్లు వసూలు చేసింది. మరి అన్ని చోట్ల అదరగొడుతున్న 'పుష్ప 2' కేవలం కేరళలో మాత్రం ఎందుకు అంత దారుణంగా వెనుకబడింది? అంటే...
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రను పుష్ప రాజ్ ఎంత దారుణంగా అవమానిస్తాడో ఇప్పటికే మూవీని చూసిన ప్రేక్షకులకి బాగా తెలుసు. ఇలా తమ హీరోలను తక్కువ చేసి చూపిస్తే, మలయాళ ప్రేక్షకులు ఏమాత్రం సహించరు. అక్కడ ఉన్నది అల్లు అర్జున్ అయినా సరే పక్కన పెట్టేస్తామని ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ద్వారా ఖరాకండిగా చెప్పేశారు కేరళ ఆడియన్స్. ముఖ్యంగా మలయాళంలో తమ సొంత హీరోలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. తమ భాషకు చెందిన హీరోల కంటే బయట హీరోలు ఎక్కువ కాదు అనే విషయం తాజాగా 'పుష్ప 2' విషయంలో మరోసారి ప్రూవ్ అయింది.
నిజానికి అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ రిలీజ్ కి ముందు మల్లు అర్జున్ అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ మలయాళ ఆడియన్స్ మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయనను తీసి పక్కన పెట్టేసారు. మొత్తానికి 'పుష్ప 2' మూవీకి కేరళలో దారుణమైన రెస్పాన్స్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?