Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Amitabh Bachchan : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానిని అని చెప్పడం ఏంటి? ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా.. నిజమే, ఈ విషయం స్వయంగా బిగ్ బి నే అన్నారు.
Allu Arjun - Amitabh Bachchan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి బిగ్ బి అమితాబ్ పెద్ద అభిమాని అట. ఈ మాట ఎవరో కాదు.. స్వయంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చనే తాజాగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. బిగ్ బి నుంచి ఈ మాట విన్న అల్లు అర్జున్.. ఆ మధ్య నేషనల్ అవార్డు వచ్చినదానికంటే ఎక్కువగా ఆనందపడుతున్నారు. మీరే మా సూపర్ హీరో అంటూ రిప్లైతో తన అభిమానాన్ని చాటుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలీదంతా ఎందుకొచ్చిందని అనుకుంటున్నారు కదా. ఆ విషయంలోకి వస్తే.. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రెమాండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఏ టాలీవుడ్ చిత్రం సాధించని విధంగా కలెక్షన్స్ రాబడుతూ.. ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ ఆనందంలో ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు బిగ్ బి నుండి వచ్చిన ఊహించని ట్వీట్‌తో మరింత ఖుషి అవుతున్నారు.
Also Read: బంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బిగ్ బి అమితాబ్ రియాక్ట్ అవడానికి కారణం.. ‘పుష్ప 2’ చిత్ర విడుదలకు ముందు ఇండియాలోని ప్రముఖ నగరాలలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అల్లు అర్జున్ ముంబై మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రస్తావన రాగా.. ‘‘అమితాబ్ బచ్చన్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారు. ఆయన ఇప్పటి జనరేషన్‌లో కూడా ఎంతో స్ఫూర్తి నింపుతున్నారు. ముఖ్యంగా నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు కూడా ఆయన స్ఫూర్తితోనే ముందుకు వెళుతున్నాను’’ అని అల్లు అర్జున్ చెప్పిన మాటలు బిగ్ బి వరకు చేరాయి. అల్లు అర్జున్ తన గురించి మాట్లాడిన మాటలపై ఆయన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Amitabh ji 🙏🏽🙏🏽🙏🏽 … you are our super hero … and listening to words like this from you is surreal . Thank you for your kind words , generous compliments and heart full wishes … Humbled by your humility 🙏🏽🙏🏽🙏🏽
— Allu Arjun (@alluarjun) December 9, 2024
‘‘థ్యాంక్యూ అల్లు అర్జున్. నువ్వు నా అర్హతకు మించి ప్రశంసలు కురిపించావు. నిజం చెప్పాలంటే నేనే నీ ప్రతిభకు, నీ పనితీరుకు పెద్ద ఫ్యాన్‌ని. ఇలానే నువ్వు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తూ ఉండాలి. ‘పుష్ప’ లాంటి సక్సెస్‌లు నువ్వు మరెన్నో అందుకోవాలి... మీకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. ఈ ఊహించని ట్వీట్‌కు అల్లు అర్జున్ సైతం షాక్ అయ్యారు. వెంటనే స్పందిస్తూ.. ‘‘అమితాబ్ జీ నమస్కారం.. మీరు మాకు సూపర్ హీరో. మీ నుండి ఇలాంటి ప్రశంసలు రావడం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి ధన్యుడిని’’ అని పేర్కొన్నారు. అంతే, బిగ్ బి- బన్నీల ట్వీట్స్ సెన్సేషన్‌గా మారాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే.. ఈ ట్వీట్స్ రీ ట్వీట్స్ చేస్తూ.. ఇది మావాడి సత్తా అంటూ కాలర్స్ ఎగరేస్తున్నారు. బన్నీకి మరో నేషనల్ అవార్డు వచ్చినంత ఆనందాన్ని వారు కూడా వారి కామెంట్స్‌లో వ్యక్తం చేస్తుండటం విశేషం.
ఇక ‘పుష్ప2’ విషయానికి వస్తే.. మొదటి వీకెండ్ ఈ సినిమా చాలా వరకు ఆల్ టైమ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో అయితే బాలీవుడ్ హీరోలను మించేశాడు పుష్పరాజ్. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా విడుదలైన రోజు 70 కోట్ల రూపాయల వసూలు చేయగా.. శుక్రవారం దాదారు రూ. 60 కోట్లు, శనివారం రూ. 73.5 కోట్లు, ఆదివారం రూ. 85 కోట్ల రూపాయలతో మొత్తంగా ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ ఫస్ట్ వీకెండ్ రూ. 285 కోట్ల రూపాయలు (నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లుగా ట్రెడ్ లెక్కలు తెలుపుతున్నాయి. సోమవారం కూడా ఈ మూవీ హాస్‌ఫుల్ బోర్డులతో నడుస్తుండటంతో.. నార్త్ ఇండియాలో ఈ సినిమాకు కొన్ని రోజులు పాటు తిరుగులేదనేలా టాక్ వినబడుతోంది.
Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?