Bigg Boss 8 Telugu Runner Up - Gautham Krishna: అశ్వత్థామ 3.0 అయ్యాడు గానీ రేసులో రెండో స్థానమే... గౌతమ్ కృష్ణకు ఎందుకిలా జరిగింది?
Gautham Krishna Bigg Boss 8 Journey: తెలుగోడు గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతాడని అందరూ భావించారు. అతడిని అశ్వత్థామ 3.0 అన్నారు. కానీ, రేసులో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సోలోగా ఆడాడు... 'బిగ్ బాస్' ఇంటిలో ఒంటరి పోరు చేశాడు... వీక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. డాక్టర్ గౌతమ్ కృష్ణ ఆట చూసి అందరూ అతడిని అశ్వత్థామ 3.0 అన్నారు. కానీ, రేసులో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్ 1లో నవదీప్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వైల్డ్ కార్డు గౌతమ్ కృష్ణ మాత్రమే. ఖచ్చితంగా టాప్ ఒకటి లేదా రెండో స్థానాల్లో గౌతమ్ కృష్ణ ఉంటాడని ఆడియన్స్ ఊహించారు. అలాగే టాప్ 2కి వచ్చాడు. విన్నర్ అవుతాడని ఫ్యాన్స్ అనుకుంటే... రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఎందుకిలా జరిగింది? అతని జర్నీలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?
సోలో బాయ్ గౌతమ్ కృష్ణ ఆటలో ప్లస్ పాయింట్స్ ఏంటి?
సీజన్ 7లో 91 రోజులు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఆడిన గౌతమ్ కృష్ణ (Gautham Krishna)కు సీజన్ 8లో ఆడుతున్న గౌతమ్ కృష్ణ 2.0కు అసలు పోలికే లేదు. అప్పట్లో శివాజీ తో కావాలనే అనవసర గొడవలకు వెళుతూ లైమ్ లైట్ లో ఉండాలని చూసిన గౌతమ్ కృష్ణ ఈ సీజన్లో మాత్రం బ్యాలెన్స్డ్ గా ఆడుతూ వస్తున్నాడు. ఆ సీజన్లో అంబటి అర్జున్ ఫైనల్ వీక్ కు వెళ్లడంతో దురదృష్టకర పరిస్థితుల్లో ఎక్కువ ఓట్లు వచ్చినా ఎవిక్ట్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. సీజన్ 8లో ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి నుండి మణికంఠ సెల్ఫ్ ఎవిక్ట్ కావడంతో బతికిపోయిన గౌతమ్ టాప్ 5కు చేరుకున్నాడు. ఈ మధ్యలో తను మార్చుకున్న తన గేమ్ ప్లాన్ చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. సోలో బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న గౌతమ్ దానికి తగ్గట్టుగానే ఆడుతూ వచ్చాడు. ఎక్కడా ఎవరి సైడు తీసుకోకుండా సోలోగానే నిలబడ్డాడు . నిఖిల్ అండ్ కో మధ్యలో గ్రూప్ గేమ్ తో గౌతమ్ ను టార్గెట్ చేయాలని చూసినా అది గౌతమ్ కృష్ణకే హెల్ప్ అయింది. ఏకంగా బిగ్ బాసే నిజంగా సోలోగా ఆడతాడా లేదా చెక్ చేయడానికి డైస్ గేమ్ ప్లాన్ చేస్తే దాని నుండి కూడా అద్భుతంగా బయటపడ్డాడు గౌతమ్. కొన్నిసార్లు హోస్ట్ నాగార్జున ద్వారా కూడా గౌతమ్ ను టార్గెట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ చూసింది అనేది గౌతమ్ అభిమానుల అభిప్రాయం. అలాగే ఎక్కడా ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడం గానీ, ఫౌల్ గేమ్ ఆడడం గాని గౌతమ్ కృష్ణ చేయలేదు. పోయిన వారంలో నిఖిల్ పై ఒక్కసారి మినహా మొత్తం సీజన్లో ఎప్పుడూఎవరి మీదా నోరు జారలేదు గౌతమ్. చివరికి ప్రేరణ సైతం వంటింట్లో గౌతమ్ ను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నామినేషన్స్ లో పృథ్వి మీదికి దూసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. నబీల్ పెట్టుకున్న అనవసర వాగ్వాదాలు ఉన్నాయి. వీటన్నిటిని సక్సెస్ఫుల్గానే హ్యాండిల్ చేసిన గౌతమ్ మరో టాప్ కంటెస్టెంట్ నిఖిల్ తో రైవల్రీ ని మాత్రం కంటిన్యూ చేశాడు. గేమ్ ప్లాన్ పరంగా ఇది ఒక మంచి ఎత్తుగడ. అది వర్కౌట్ అయింది కూడా. కానీ చివరకు ట్రోఫీ అందించలేదు.
Also Read: గౌతమ్ కాదు... నిఖిలే విన్నర్ - అనౌన్స్ చేసిన నాగార్జున... ట్రోఫీ అందించిన రామ్ చరణ్
గౌతమ్ కృష్ణ ట్రోఫీ ముందు ఎందుకు ఆగాడు?
ఆట మొత్తం సోలో బాయ్ గానే ఆడినా గౌతమ్ అస్తమాను అదే విషయాన్ని చెప్పడం చివరికి వచ్చేసరికి బోర్ కొట్టించింది. ప్రతిసారి కెమెరాలతో మాట్లాడటం కూడా గౌతమ్ కావాలనే ఇలా చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగించింది. సోలో బాయ్ గా అడడం గౌతమ్ కు టాప్ 5కు చేరుకోవడం వెనుక ఎంత ప్లస్ అయిందో టైటిల్ విన్ కావడం లో అంతే మైనస్ అయ్యింది. నిఖిల్ కు తన ఫ్రెండ్స్ యశ్మీ, పృథ్వి, విష్ణు ప్రియల ఓటింగ్ ఎంతో కొంత హెల్ప్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని అనుకున్నా అలా జరగలేదు. గౌతమ్ కు పడిన ఓటింగ్ కేవలం అతనిది మాత్రమే. అందులో ఏమాత్రం తగ్గినా నెంబర్ 2 స్థానంతోనే గౌతమ్ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గౌతమ్ ఆటకు అతిపెద్ద మైనస్ అయ్యింది. కానీ నీరసంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 ను కామెడీతో అవినాష్ రక్షిస్తే, ఫైర్ తో ఆడుతూ గౌతమ్ కాపాడాడు. కానీ అతడిని విజేతగా నిలపడంలో సక్సెస్ కాలేదు.
Also Read: నిఖిల్ కంటే ముందు 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్లు ఎవరో గుర్తున్నారా?