Mohanbabu Gun: గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Manchu Dispute: కుమారుడితో జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు గన్ బయటకు తెచ్చారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు విష్ణు గన్‌లను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Police ordered Mohan Babu and Vishnu guns to be seized: మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడులు చేశారు. ఆ సమయంలో ఆయన వద్ద గన్ ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలియడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు విష్ణుకు ఇచ్చిన గన్ లైసెన్స్‌లను తక్షణం హోల్డ్ లో పెట్టి గన్స్ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంచు మనోజ్ దంపతులు ఇంటికి వెళ్లే సరికి గేట్ వేసి ఉంది. సెక్యూరిటీ సిబ్బంది గేటు తీసేందుకు నిరాకరించారు. దాంతో గేటు తోసేసుకుని ఆయన లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే మనోజ్ తో పాటు ఆయన భార్య, బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేసి గేట్లు వేసేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని కోరేందుకు వెళ్లారు. ఇంటలిజెన్స్ డీజీ, డీజీపీతో పాటు రాచకొండ కమిషనర్ ను కలిసి తమ కుటుబంంలో వివాదాల గురించి, తనపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత నేరుగా ఆయన జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
అయితే అప్పటికే మనోజ్ కు సంబంధించిన సామాన్లను మోహన్ బాబు నాలుగు వాహనాల్లో బయటకు పంపేందుకు మోహన్ బాబు ఏర్పాట్లు చేశారు. మరో వైపు మనోజ్ ను ఇంట్లోకి అనుమతించవద్దని సెక్యూరిటీకి చెప్పారు. దాదాపుగా యాభై మంది బౌన్సర్లను మోహరించారు. అయితే మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు తీయకపోవడంతో గట్టిగా తోసేసుకుని ఆయన లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు భార్య మౌనిక.. కొంత మంది సన్నిహితులు కూడా వెళ్లారు.
మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది. ఓ టీవీ చానల్ ప్రతినిధి మైక్ లాక్కుని ఆయనపై దాడి చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. మంచు మనోజ్ పైనా దాడి చేసి బయటకు పంపించారు.