Rajpal Yadav: చేతిలో 1200 కోట్ల పని, 10 సినిమాలు... చెక్ బౌన్స్ కేసులో జైలుకు... రాజ్‌పాల్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్
Rajpal Yadav Video: చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్‌పాల్ యాదవ్ తన న్యాయ బృందంతో కలిసి సహాయం చేసిన వారి గురించి మాట్లాడారు.

చెక్ బౌన్స్ కేసులో తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌లో తన న్యాయ బృందంతో కలిసి హాజరయ్యారు. అందులో చెక్ బౌన్స్ కేసు గురించి ఆయన మాట్లాడారు. అసలు విషయం ఏమిటో వివరించారు. తన చేతిలో కోట్లాది రూపాయల ప్రాజెక్ట్‌లు ఉన్నప్పటికీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 1200 కోట్ల ప్రాజెక్ట్‌లు ఉన్నాయి
రాజ్‌పాల్ యాదవ్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పారు. ''వచ్చే సంవత్సరాల్లో నా దగ్గర బ్రాండింగ్ కోసం రూ. 1200 కోట్ల వర్క్ ఉంది. నా దగ్గర 4 అగ్రిమెంట్స్ ఉన్నాయి. అందులో సినిమాలు లేవు. కొన్ని ప్రాజెక్ట్‌లు రూ. 200 కోట్లవి, మరికొన్ని రూ. 2000 కోట్లవి ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో డబ్బులు తీసుకుంటున్నా. కొన్ని ప్రాజెక్ట్‌లలో వాటాలు ఉన్నాయి. నాకు 10 సినిమాలు లైన్‌లో ఉన్నాయి'' అని రాజ్‌పాల్ యాదవ్ చెప్పారు.
Also Read: Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
పిల్లలు కూడా డబ్బులు ఇచ్చారు
అంతే కాకుండా తనకు చాలా మంది సహాయం చేశారని రాజ్‌పాల్ యాదవ్ చెప్పారు. అభిమానులు, పిల్లలు కూడా తమ డబ్బులు తీసి ఇచ్చారని తెలిపారు. రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ... ''గత 20 రోజుల్లో పిల్లల నుంచి, సోషల్ మీడియా నుంచి కోటి రూపాయలు & మరెన్నో వచ్చాయి. నేను వారి పేర్లను పేర్కొంటూ ఒక ప్రకటన పంపుతా. వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నా. అలాగే, తెలియని వారందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను'' అని అన్నారు.
Also Read: Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
అందరి డబ్బులు తిరిగిస్తాను
తనకు డబ్బులు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని రాజ్‌పాల్ యాదవ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నాకు వాళ్ళ బ్యాంక్ వివరాలు పంపమని కోరుతున్నాను. అలాగే, నాకు కొంత సమయం కావాలి. నేను వారికి గౌరవంగా డబ్బులు తిరిగి చెల్లిస్తాను. అయితే నాతో నిలబడిన దేశంలోని చాలా మంది పిల్లల రుణం నేను తీర్చలేను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. రాజులా జీవించండి, కార్మికుడిలా పని చేయండి. రాజు ఎక్కడున్నా రాజే... అతను జైలులో ఉన్నా లేదా ఇక్కడ ఉన్నా! రాజు పారిపోడు, దాక్కోడు'' అని అన్నారు.
Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















