బిగ్ బాస్ 8 బ్యూటీ నయని లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Published by: Satya Pulagam

అసలు పేరు నయని కాదు... పవని

ఎక్కువ మంది ఈ అమ్మాయిని నయని అంటారు. కానీ, ఆ అమ్మాయి పేరు నయని కాదు. అసలు పేరు సాయి పవని రాజు. ఆమె అక్క పేరు నయని. గ్రాడ్యుయేషన్ టైంలో సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు నయని పవని పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేశారు. అది పాపులర్ అయ్యింది. 

పవని సొంతూరు ఏదో తెలుసా?

సాయి పవని రాజుది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు. ఆవిడ తల్లి ప్రభుత్వ ఉద్యోగి. పుత్తూరులోని జన జ్యోతి విద్యా మందిర్ లో స్కూలింగ్ కంప్లీట్ చేశారు.

చెన్నైలో బీబీఏ చేసిన పవని

పుత్తూరులో స్కూల్, ఇంటర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన సాయి పవని రాజు... ఆ తర్వాత బీబీఏ చేయడం కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ యూనిర్సిటీలో చేరారు.

బీబీఏ చేసేటప్పుడు యూట్యూబ్ ఎంట్రీ

సాయి పవని రాజు బీబీఏ చేసే సమయంలో సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో ఆమెకు యూట్యూబ్ సాంగ్స్ చేసే అవకాశం లభించింది. కేవలం షణ్ముఖ్ జస్వంత్ తో సాంగ్స్ చేయడానికి చెన్నై నుంచి విశాఖ వచ్చి వెళ్లారు.

గత ఏడాది కోలుకోలేని విషాదం

సాయి పవని రాజు వ్యక్తిగత జీవితంలో గత ఏడాది కోలుకోలేని విషాదం ఎదురైంది. ఆమె తండ్రి మరణించారు. దాన్నుంచి బయటకు రావడానికి ఆమెకు కొంత సమయం పట్టింది.

నిహారిక సినిమాలో నటించిన పవని

సాయి పవని రాజు కెరీర్ విషయానికి వస్తే... నిహారిక కొణిదెల, సుమంత్ అశ్విన్ నటించిన 'సూర్యకాంతం'లో ఆవిడ ఒక రోల్ చేశారు. సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అది.

తొలి పారితోషికం ఎంతో తెలుసా?

నటన మీద ఆసక్తితో సాయి పవని రాజు కొన్ని సాంగ్స్, వీడియోస్ ఫ్రీగా చేశారు. 'పెళ్లి చూపులు 2.0'లో రెండు రోజులు నటించినందుకు తొలి పారితోషికం పది వేలు అందుకున్నారు.

తమిళంలోనూ నటించాలని కోరిక

తమిళనాడు బోర్డర్ ఏరియాలో పెరగడం వల్ల తనకు తమిళం కూడా బాగా వచ్చని, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తే చేయాలని ఉందని గతంలో ఒకసారి మనసులో మాట బయట పెట్టారు. 

పవనీని కన్న కుమార్తెలా చూస్తున్న శివాజీ

తండ్రి మరణం తర్వాత బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన పవనీకి ఆ సీజన్ లో శివాజీ పరిచయం అయ్యారు. ఆయన్ను డాడీ అంటుంది. ఈ అమ్మాయిని ఆయన కూడా కన్న కుమార్తెలా చూసుకుంటున్నారు.