డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్​బాస్​ హౌజ్​లో 5వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే

Published by: Geddam Vijaya Madhuri

నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్​బాస్​ హౌజ్​లో 5వ వారం నామినేషన్ ప్రక్రియ వాడీవేడిగా జరిగింది. మరి ఈ వారం నామినేషన్ లిస్ట్​లోకి వచ్చింది ఎవరంటే..

విష్ణు ప్రియ

గేమ్స్​ ఆడట్లేదు అంటూ విష్ణుప్రియను నామినేట్ చేశారు హౌజ్​ మేట్స్. దానికి బాగానే డిఫెండ్ చేసుకుంది కానీ గేమ్స్ ఆడితే ఈ వారం కూడా విష్ణు గ్రాఫ్ పడిపోకుండా ఉంటుంది.

నైనిక

హోజ్​లో యాక్టివ్​గా ఉండట్లేదు.. మాట్లాడట్లేదు.. గేమ్స్ పరంగా కూడా గ్రాఫ్ తగ్గిపోతుందంటూ ఈమెను కూడా హౌజ్​మేట్స్ నామినేట్ చేశారు.

మణికంఠ

నాగమణికంఠ అందరికీ జాక్​పాట్​లా దొరికాడు. మాటాలు ఫ్లిప్ చేస్తున్నాడంటూ దాదాపు అందరూ నామినేట్ చేశారు. మణికంఠ ఎమోషనల్​గా వీక్​ ఉన్నాడంటూ చూపిస్తున్నారు.

ఆదిత్య

గేమ్స్​లో, హౌజ్​లో యాక్టివ్​గా ఉండట్లేదనే కారణంతో ఆదిత్య నామినేషన్​లోకి వచ్చాడు. కాన్ఫిడెంట్​గా ఉండట్లేదని ప్రేరణ నామినేట్ చేయగా.. ఆదిత్య దానికోసం ఫైర్​లో హ్యాండ్ పెట్టాడు.

నబిల్

నబిల్ వల్లే తమ టీమ్​కి రేషన్ దక్కలేదని అతని క్లాన్ సభ్యులు నామినేట్ చేశారు. సంచాలక్​గా సీరియస్​గా ఉండాలంటూ సూచనలిచ్చారు.

నిఖిల్

ఈసారి ఛీఫ్​లలో ఎవరూ నామినేట్ అవ్వాలో హోజ్​మేట్స్​ని డిసైడ్ చేయమనగా.. నిఖిల్​కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఈ వారం నామినేషన్​లోకి అతను వచ్చాడు.

ఎలిమినేషన్..

అయితే ఈ వారం మిడ్​ వీక్​లో ఒకరు.. వీకెండ్​లో ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీల నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటున్నారు.

సోనియా ఆకుల

సోనియా ఆకుల ఎలిమినేషన్ తర్వాత.. నెక్స్ట్ వీక్ బయటకు వచ్చే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరో వేచి చూడాల్సిందే.