మూడో వారం నామినేషన్​ లిస్ట్

బిగ్​బాస్ 8 మూడో వారం నామినేషన్​ లిస్ట్ ఇదే.. సోనియా ఈసారి కూడా లేదా?

Published by: Geddam Vijaya Madhuri

హీటెడ్ ఆర్గ్యూమెంట్స్

బిగ్​బాస్​ 8 తెలుగు మూడో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. కంటెస్టెంట్లు ఓ రేంజ్​లో ఆర్గ్యూమెంట్స్ చేసుకున్నారు.

యశ్మీ గౌడ

చీఫ్​గా పదవిని కోల్పోయి.. యశ్మీ గౌడ ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది. ఈమె నైనిక, మణికంఠను నామినేట్ చేసింది.

ప్రేరణ కంబం

గతవారం ప్రేరణను యశ్మీ నామినేషన్స్ నుంచి సేవ్ చేసింది. ఈ వారం మాత్రం నామినేషన్స్​ నుంచి తప్పించుకోలేకపోయింది.

కిర్రాక్ సీత

గేమ్​ బాగా ఆడి.. నాగార్జునతో కిర్రాక్ సీత అని చెప్పించుకున్నా.. మూడోవారం నామినేషన్స్​ లిస్ట్​లో ఈమె కూడా చేరాల్సి వచ్చింది.

పృథ్వీరాజ్

ఎదుటివాళ్ల ద్వారా ఇన్​ఫ్లూయెన్స్ అయ్యే కంటెస్టెంట్​లలో పృథ్వీ ఒకరు. గతవారం ఇతనికి ఓట్లు కూడా తక్కువే వచ్చాయి. ఈ వారం కూడా నామినేషన్​లో ఉన్నాడు.

విష్ణుప్రియ

సిల్లీ రీజన్​తో ప్రేరణ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఈ ఆర్గ్యూమెంట్​లో విష్ణు చాలా వ్యాలిడ్ పాయింట్స్​ని రైజ్ చేసింది.

నైనిక

తన క్లాన్స్​ని కాపాడుకోవడంలో నైనిక విఫలమైంది. ఈ వారం కూడా నైనిక నామినేషన్​లోనే ఉండాల్సి వచ్చింది.

మణికంఠ

ఈ సీజన్​లో నేను ఎన్ని వారాలుంటే నిన్ను అన్ని వారాలు నామినేట్ చేస్తానంటూ యశ్మీ.. మణికంఠను నామినేట్ చేసింది.

అభయ్ నవీన్

క్లాన్స్​కి చీఫ్​లలో ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్​బాస్​ చెప్పగా.. అభయ్ తనని తాను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు.

సోనియా

ఇంట్లో గేమ్స్ ఆడకపోయినా నోటి మాటలతో దిగజారుతున్న సోనియా ఈ వారం కూడా నామినేషన్స్​ నుంచి తప్పించుకుంది.