ఈ వారం నామినేట్ అయ్యింది వీళ్లే

బిగ్​బాస్ 8 నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే.. లిస్ట్​లోకి సోనియా ఉందిగా

Published by: Geddam Vijaya Madhuri

ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్

బిగ్​బాస్​లో నామినేషన్స్ కాస్త ఇంట్రెస్టింగ్​గానే ఉంటాయి. సీజన్ అంతా చూడనివాళ్లు కూడా ఈ నామినేషన్స్​ని ఇంట్రెస్టింగ్​గా చూస్తారు. 8వ సీజనలో 4వ వారం నామినేషన్లు కూడా అలాగే సాగాయి.

నామినేషన్స్

ఈవారంలో నామినేట్ అయ్యింది ఎవరో.. ఎవరు తృటిలో తప్పించుకున్నారో.. ఇప్పుడు చూసేద్దాం.

నబిల్

నబిల్ ఈవారం నామినేషన్​లో ఉన్నాడు. ఎక్కువమందితో కలవకపోయినా.. నబిల్ టాస్క్​లు బాగానే ఆడుతున్నాడు. ముఖ్యంగా సోనియాకు ఇతను ఇచ్చే ఆన్సర్లుకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

సోనియా

సోనియా ఎట్టకేలకు నామినేషన్​కి వచ్చింది. ఈవారం ఆమెను ఎలా అయినా పంపేయాలంటూ యూట్యూబ్ వీడియోల కింద పలువులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈమె వెళ్తే అసలు మజానే ఉండదంటూ కొందరు చెప్తున్నారు.

ప్రేరణ

గతవారంలో టాస్క్​ల్లో ప్రేరణ బాగా ఆడింది. కానీ నోటిని కంట్రోల్ చేసుకోలేకోపోయింది. దీనివల్ల ఈ వారం నామినేషన్​లోకి ఆమె కూడా రావాల్సి వచ్చింది.

ఆదిత్య ఓం

టాస్క్​ల్లో పెద్దగా పాల్గొనకపోవడం వల్ల ఆదిత్య ఓం కూడా ఈ వారం నామినేషన్​లో ఉన్నారు. పైగా ఈయనవల్ల పెద్దగా ఫుటేజ్​ కూడా రావడంలేదనేది నిజం.

పృథ్వీరాజ్

టాస్క్​ల్లో ముందువెనుకా చూసుకోకుండా గేమ్ ఆడుతూ.. బూతులు మాట్లాడుతూ నామినేషన్​లోకి వచ్చాడు పృథ్వీ. సోనియా అతని గేమ్​ని బాగా డిస్టర్బ్ చేస్తుందని ఆడియన్స్ బాగా ఫీలవుతున్నారు.

మణికంఠ

నామినేషన్స్ అంటే మణికంఠ. మణికంఠ అంటే నామినేషన్స్ అన్నట్లు తయారైంది. పైగా ఇతనిని యశ్మీ ప్రతివారం నామినేట్ చేస్తానంటూ గతవారంలోనే చెప్పింది.

నైనిక

నైనిక ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది. కానీ.. నిఖిల్​కి బిగ్​బాస్​ ఇచ్చిన పవర్​తో నైనికను నామినేషన్స్​ నుంచి బయటకు తీసుకొచ్చాడు. లేదంటే నైనిక కూడా ఈ వారం నామినేషన్​లో ఉండేది.