బిగ్ బాస్ 8 తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీలు వీళ్లే

యూట్యూబర్ నయని... లాస్ట్ సీజన్ (బిగ్ బాస్ 7)లో వారానికి బయటకు వచ్చిన ఈ అమ్మాయి ఈసారి ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

నటి హరితేజ... ఫస్ట్ సీజన్ తర్వాత ఈ యాక్ట్రెస్ మళ్లీ 'బిగ్ బాస్' ఇంటికి వచ్చింది.

జబర్దస్త్ రోహిణి... జబర్దస్త్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈవిడ, మూడో సీజన్ 'బిగ్ బాస్'లో సందడి చేసింది. మళ్ళీ వచ్చింది. 

గంగవ్వ... నాలుగో సీజన్లో ఆవిడ పార్టిసిపేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. 

డాక్టర్ గౌతమ్ కృష్ణ... లాస్ట్ సీజన్ (బిగ్ బాస్ 7) తర్వాత మరోసారి ఈ డాక్టర్ కమ్ యాక్టర్ 'బిగ్ బాస్' ఇంటికి వచ్చాడు

మెహబూబ్ దిల్ సే... నాలుగో సీజన్ తర్వాత మరోసారి ఈ యూట్యూబర్ బిగ్ బాస్ షోకి వచ్చాడు 

టేస్టీ తేజ... లాస్ట్ సీజన్ (బిగ్ బాస్ 7) తర్వాత మరోసారి బిగ్ బాస్ ఇంటికి వచ్చారు.