Rashmika Mandanna: రాజసం ఉట్టిపడేలా మండపంలోకి రష్మిక... పల్లకిలో పెళ్లి కూతురు - ఫోటోలు వైరల్
Rashmika Entry In Virosh Wedding: ఉదయపూర్ లో రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం (విరోష్ వివాహం) అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి మండపంలో రష్మిక ఎంట్రీ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna), సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)లు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వీరిద్దరి అనుబంధం, ప్రేమ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎప్పుడూ తమ సంబంధాన్ని రహస్యంగానే ఉంచారు. తాజాగా ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితుల సమక్షంలో ఏడు అడుగులు వేశారు. తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించారు. పెళ్లికి 'విరోష్ వెడ్డింగ్' అని పేరు పెట్టారు. పెళ్లి ఫోటోలు బయటకు రాగానే కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
పల్లకిలో మండపానికి వచ్చిన రష్మిక
రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని రాయల్ స్టైల్‌లో వెడ్డింగ్ జరిగింది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పెళ్ళి చేసుకున్నారు విజయ్ - రష్మిక. పెళ్ళి మండపం సాంప్రదాయం, ఆధునికతల అందమైన కలబోతలా కనిపించింది. అయితే, ఆ మండపంలోకి రష్మిక ఎంట్రీ వైరల్ అవుతోంది. ఆమె పల్లకిలో వచ్చింది. ఈ విజువల్స్ భారీ సినిమా కంటే అసలు ఏమాత్రం తక్కువ కాదు. రష్మిక ముఖంలోని చిరునవ్వు, ఆమె అందం అందరి హృదయాలను గెలుచుకున్నాయి.
Also Read: Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
View this post on Instagram
రష్మిక ఎమోషనల్ క్యాప్షన్... రికార్డు లైక్స్!
పెళ్ళి ఫోటోలను షేర్ చేసిన రష్మిక... ఎమోషనల్ క్యాప్షన్ రాసింది. విజయ్ దేవరకోండను తనకు అతిపెద్ద సపోర్టర్, నిజమైన స్నేహితుడిగా పేర్కొంది. విజయ్ తనపై తనకు నమ్మకం ఉంచమని, పెద్ద కలలు కనడానికి ధైర్యం ఇచ్చాడని, ప్రతి అడుగులోనూ తనకు తోడుగా నిలిచాడని ఆమె చెప్పింది.
Also Read: Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు, వారిద్దరి అభిమానులు 2020 నుంచి ఈ జంట తరచుగా కలిసి సమయం గడుపుతున్నారని గమనించడం ప్రారంభించారు. వారి బంధం గురించి 2022లో పుకార్లు మరింత పెరిగాయి. అయితే, ఎప్పుడూ బహిరంగంగా ఏమీ చెప్పలేదు. అక్టోబర్ 2025లో హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు, ఇద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా అంగీకరించారు.
Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు























