అన్వేషించండి

Watermelon Consumption : పుచ్చకాయ అంటే ఇష్టమా? మధుమేహంతో పాటు ఈ ఆరోగ్య సమస్యలుంటే అస్సలు తినొద్దంటోన్న నిపుణులు

Watermelon Health Precautions : పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు దానికి దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు. ఇంతకీ ఎవరూ దీనిని తినకూడదో తెలుసా?

Watermelon Consumption During Summer : సమ్మర్​లో ఎక్కువమంది తినే ఫ్రూట్స్​లో పుచ్చకాయ ఒకటి. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. నేరుగా, జ్యూస్​ల రూపంలో దీనిని డైట్​లో చేర్చుకుంటారు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. హైడ్రేషన్​ని అందిస్తుంది. సమ్మర్​లో దీనిని బెస్ట్​ ఫుడ్​గా తీసుకుంటారు. ఆరోగ్యానికి కూడా దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. కేవలం పుచ్చకాయే కాదు.. పుచ్చకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు అందిస్తాయి. 

ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే ఈ పుచ్చకాయను కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. వేసవిలో దీనిని ఎక్కువగా తినే అలవాటు ఉంటే కచ్చితంగా దానిని కంట్రోల్ చేయడమో.. లేదా పూర్తిగా నివారించడమో చేయాలంటున్నారు. అసలు ఏ ఆరోగ్య సమస్యలు ఉంటే దీనిని తినకూడదో.. దీనిని తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

జీర్ణ సమస్యలు 

జీర్ణ సమస్యలున్నవారు పుచ్చకాయను తినకపోవడమే మంచిదట. పుచ్చకాయలో అధిక నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా.. కొందరిలో కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది. అందుకే వాటిని లిమిట్​గా తీసుకోవడమో.. పూర్తిగా కంట్రోల్ చేయడమో చేయాలని అంటున్నారు. 

షుగర్ ఉన్నవారు.. 

మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. పుచ్చకాయలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. దానిలోని సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నెగిటివ్​గా ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవచ్చని చెప్తారు. 

కిడ్నీ సమస్యలు ఉంటే.. 

పుచ్చకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. 

లైకోపీన్

పుచ్చకాయను అధికంగా తీసుకుంటే లైకోపీన్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల చర్మం నారింజ రంగులోకి మారుతుంది.

ఇవే కాకుండా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడేవారు దీనిని తినకపోవడమే మంచిది. జ్వరం, అలెర్జీలతో ఇబ్బంది పడేవారు కూడా పుచ్చకాయను కంట్రోల్ చేయడమే మంచిదని చెప్తున్నారు. 

ఎంత తింటే మంచిది..

ఈ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను లిమిట్​గా తీసుకున్నా.. ఆరోగ్యంగా ఉండేవారు కూడా దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదని చెప్తున్నారు. రోజుకు 100-150 గ్రాములు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కూడా అందుతాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : సమ్మర్​లో పుచ్చకాయను ఇలా తీసుకుంటే.. హెల్త్​కి, బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Smartwatch Buying Tips : స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
Liver Fibrosis in Diabetics : షుగర్ ఉన్నవారికి కొత్త ప్రమాదం.. ప్రతి 4 మధుమేహ రోగుల్లో ఒకరికి లివర్ ఫైబ్రోసిస్, న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
షుగర్ ఉన్నవారికి కొత్త ప్రమాదం.. ప్రతి 4 మధుమేహ రోగుల్లో ఒకరికి లివర్ ఫైబ్రోసిస్, న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
Watermelon vs Muskmelon : పుచ్చకాయ vs ఖర్బూజ.. వేసవిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గొచ్చు?
పుచ్చకాయ vs ఖర్బూజ.. వేసవిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గొచ్చు?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Embed widget