అన్వేషించండి

Watermelon Rind : పుచ్చకాయ తొక్కలను పడేస్తున్నారా? మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలున్నవారికి అవి వరమట

Watermelon Rind Benefits : వేసవిలో దాదాపు అందరూ తినే ఫ్రూట్స్​లలో పుచ్చకాయ కచ్చితంగా ఉంటుంది. అయితే పుచ్చకాయ తిని తొక్కను పడేసే అలవాటు మీకుందా? అయిదే ఇది మీకోసమే..

Watermelon Rind for Healthy Life : పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్​లో డీ హైడ్రేషన్​నుంచి తప్పించుకునేందుకు చాలామంది దీనిని తింటారు. పుచ్చకాయలోని 90 శాతం నీరు మీరు నిర్జలీకరణానికి గురికాకుండా రక్షిస్తుంది. అందుకే దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తింటారు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలామంచిది. వివిధ ఆరోగ్య సమస్యలనుంచి పుచ్చకాయ మనల్ని రక్షిస్తుంది. అందుకే మధుమేహమున్నవారు కూడా తగిన మోతాదులో దీనిని తింటారు. సాధారణంగా పుచ్చకాయ గుజ్జును తిని తొక్కను పడేస్తూ ఉంటాము. అయితే మీరు కూడా అదే రకమైతే.. పుచ్చకాయ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. 

పుచ్చకాయ పైభాగం కాస్త గట్టిగా.. పచ్చని రంగులో ఉంటుంది. దానిలోపల ఎర్రని భాగం, గింజలతో నిండి ఉంటుంది. లోపలి భాగాన్ని తినేసి.. బయట భాగాన్ని పడేస్తూ ఉంటాము. అయితే పుచ్చకాయ తొక్క కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది అంటుంది ఆయుర్వేదం. దీనిలో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఐరన్, ఫైబర్​ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. వీటిలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తినకూడదు అనుకుంటారు. 

పుచ్చకాయ తొక్కలోని పోషకాలు ఇవే

పుచ్చకాయ తొక్కలు పోషకాలను కలిగి ఉండటమే కాకుండా.. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటుంది. పైగా దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పలు రకాల విటమిన్లు, పొటాషియం, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. పుచ్చకాయ తొక్కలో క్లోరోఫిల్, సిట్రులిన్, లైకోపీన్, అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తొక్కను మీరు నేరుగా తినలేకపోయినా.. దానిని రుచిగా మార్చుకునే విధానాలు కూడా చాలా ఉన్నాయి. 

ఇలా కూడా తీసుకోవచ్చు..

పుచ్చకాయ తొక్కలోని పోషకాలు గుర్తించిన పలు దేశాల్లో దీనిని పలు రూపాలలో తీసుకుంటారు. మీరు కూడా తొక్కలను తినలేము అనుకుంటే.. వివిధ రకాలుగా దానిని మీ డైట్​లో తీసుకోవచ్చు. కొందరు పుచ్చకాయ తొక్కలతో ఊరగాయ చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల వాటి రుచి చాలా మారిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ ఇంకోసారి తినాలనే కోరికను ఇది కలిగిస్తుంది. మరికొందరు సమ్మర్​ డ్రింక్​గా తీసుకుంటారు. పుచ్చకాయ తొక్కలను జ్యూస్​, మిక్స్, స్మూతీలలో ఉపయోగిస్తారు. ఈ తరహా రెసిపీలు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 

ఆరోగ్య ప్రయోజనాలు 

పుచ్చకాయలోని విటమిన్స్, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పుచ్చకాయ తొక్కలు తినడం వల్ల సిట్రూలిన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. జీర్ణక్రియ, కొలెస్ట్రాల్​ని కంట్రోల్​లో ఉంచడమే కాకుండా.. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 

Also Read : రోజూ ఈ పనులు చేస్తే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు మీ సొంతమవుతుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Vijayawada Highway: సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
Makar Sankranti 2025 : భోగి మంట హోమంతో సమానం.. ట్రెండీగా కాదు ట్రెడిషనల్ గా వెలిగించండి!
భోగి మంట హోమంతో సమానం.. ట్రెండీగా కాదు ట్రెడిషనల్ గా వెలిగించండి!
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
Embed widget