Healthy Life : రోజూ ఈ పనులు చేస్తే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు మీ సొంతమవుతుంది
Fitness Goals : ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు చనిపోతామో తెలియకపోవచ్చు. కానీ సహజమైన మరణానికి మాత్రం కచ్చితంగా మనదే బాధ్యతం. మన జీవన శైలినే మన ఆయుష్షును డిసైడ్ చేస్తుంది.
Tips for a Healthier Life : సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కొన్ని అంశాలు మన నియంత్రణలో లేనప్పటికీ.. మన ఆయుష్షు రేఖను పెంచుకునేందుకు మనం చేయగలిగే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. సగటు వ్యక్తి జీవనశైలిని తన నియంత్రణలో ఉంచుకుంటే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు అతని సొంతమవుతుందని నిపుణులు చెప్తున్నారు. అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం కలిగిన వ్యక్తులు కూడా.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల సంవత్సరాల తరబడి ఆ లక్షణాలు అరికట్టవచ్చు అంటున్నారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి కొన్ని అంశాలను పాటించాలని సూచిస్తున్నారు.
సానుకూలమైన ఆలోచన
ఏ విషయంలోనైనా సానుకూలంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలట. ఇది ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది అంటున్నారు. లేదంటే శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయని.. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని.. ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కానీ సానుకూలంగా ఆలోచించడం వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. పైగా ఇలా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు.
యాక్టివ్‌గా ఉండాలి..
శారీరక శ్రమ అనేది సుదీర్ఘమైన జీవితకాలాన్ని అందిస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. కార్డియోవాస్కులర్ కండిషనింగ్ ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడు సెల్యూలార్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్, ప్రోటీన్లను పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. ఆరోగ్యంగా ఉండడంలో సహాయం చేస్తుంది. కనీసం ఇంటి పనులైనా యాక్టివ్‌గా చేయడం ప్రారంభించగలిగితే అదే మీకు మంచి వ్యాయామం అవుతుంది. మెట్లు ఎక్కడం, దిగడం వంటి యాక్టివిటీలు.. ఆరోగ్యానికి చాలా మంచివి. జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా, స్పిన్నింగ్ వంటివి కూడా మీరు చేయవచ్చు.
బాగా తినాలి..
కొందరు ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ మానేయాలి అనుకుంటారు. కానీ కానే కాదు. మీరు మంచిగా తిని.. తిన్న దానికి తీసిపోకుండా పని చేయాలి. అలాంటప్పుడు మీరు ఫుడ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా అని అతిగా తినకూడదు. శరీరానికి ఏది ఎంతమేరకు అవసరమో అంత ఇస్తే సరిపోతుంది. మంచి డైట్ ఫాలో అవ్వడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర వయసు సంబంధిత వ్యాధులు రావు. ఇది మీకు ఆరోగ్యకరమైన ఆయుష్షును అందిస్తుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోండి..
దీర్ఘకాలిక ఒత్తిడి చిత్తవైకల్యం, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రోజూవారీ దినచర్యలో ఒత్తిడి తగ్గించుకునేందుకు కొన్ని పనులు చేస్తే మంచిది. ధ్యానం, వ్యాయామం ఆరోగ్యకరమైన దీర్ఘాయువును అందిస్తాయి. ప్రతి రోజూ కేవలం పది నిమిషాలు ధ్యానం చేసినా.. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది అభిజ్ఞా సామర్థ్యాలను కూడా పెంచుతుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు గుర్తించినప్పుడు మందులు రెగ్యూలర్‌గా తీసుకోవాలి. డాక్టర్లు సూచించిన డైట్, వ్యాయామాలు చేయాలి. ఇవి మీకు వ్యాధులు కలిగినా.. ఆరోగ్యంగా ఉండడంలో, సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవడంలో హెల్ప్ అవుతాయి. రెగ్యూలర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటే.. దీర్ఘాయువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముందుగానే రోగాలు గుర్తించి.. వాటికి తగిన చికిత్సలు తీసుకునే వీలు ఉంటుంది.
Also Read : కొవ్వు వేగంగా తగ్గాలంటే ఈ వ్యాయామంతో పాటు ఆ ఫుడ్స్ తీసుకోవాలట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.