Tips to Reduce Belly Fat : కొవ్వు వేగంగా తగ్గాలంటే ఈ వ్యాయామంతో పాటు ఆ ఫుడ్స్ తీసుకోవాలట
Belly Fat : కొందరు సన్నగా ఉన్నా పొట్ట పెరగడం, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. అలాంటి వారు తమ డైట్లో కొన్ని ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.
Quick Trick to Reduce Belly Fat : బరువు తగ్గడం, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానకి చాలా కష్టపడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరికి కొవ్వు తగ్గదు. ముఖ్యంగా పొట్ట భాగంలో.. బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఆలస్యంగా కరుగుతుంది. అయితే ఈ కొవ్వును వేగంగా కరించుకునేందుకు.. ఓ ఎఫెక్టివ్ వ్యాయామం ఉంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొవ్వు వేగంగా కరుగుతుంది అంటున్నారు. ఇంతకీ అది ఏ వ్యాయామమో.. ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం విషయానికొస్తే..
ముందుగా నేలపై లేదా యోగా మ్యాట్‌పై పడుకోవాలి. తలకింద చేతులు పెట్టుకుని.. ఇప్పుడు మీ కుడి మోచేతిని.. ఎడమ మోకాలికి టచ్ చేయాలి. ఇప్పుడు ఎడమ మోచేతిని.. కుడి కాలుతో టచ్ చేయాలి. ఈ క్రంచ్స్ను రోజూ పది నిమిషాలు చేయాలి. లేదంటే నిటారుగా నిల్చోని.. చేతులను తల వెనుక భాగంలో ఉంచి.. మోచేతులను, మోకాళ్లను టచ్ చేయాలి. ఇలా రెగ్యూలర్‌గా చేయడం వల్ల పొట్ట, బొడ్డు చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది అంటున్నారు. మీకు జిమ్ వెళ్లడం కుదరకపోతే.. ఇంట్లోనైనా ఈ వ్యాయామం సులువుగా చేయవచ్చు. ఇది పొట్టపై, సైడ్స్‌పై కాస్త ప్రెజర్ పెట్టి.. కొవ్వు వేగంగా కరిగేలా చేస్తుంది.
ఫుడ్స్ విషయంలో..
- అవకాడో.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి మీకు కడుపు నిండుగా ఉండి.. సంతృప్తిగా అనిపించడంలో సహాయం చేస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తాయి.
- బెర్రీస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తాయి.
- ప్రోటీన్, ప్రోబయోటిక్స్‌తో గ్రీక్ యోగర్ట్ నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. హెల్తీ గట్ను ప్రోత్సాహిస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది.
- బచ్చలి కూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అధిక ఫైబర్‌ను కలిగి ఉండి.. బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
- సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించి.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- బాదం, వాల్నట్స్ వంటి ఇతర నట్స్‌లలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి హెల్తీ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని అరికట్టి.. బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా వీటిని హెల్తీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
- ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తాయి.
Also Read : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్లో ఉంటుందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.