Morning Drinks for Diabetics : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్లో ఉంటుందట
Drinks for Diabetics : ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం డయాబెటిస్ పేషెంట్లు ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తాగితే మంచిది. అయితే కడుపు ఖాళీగా ఉన్నప్పుడే అంటే పరగడుపునే వీటిని తాగాలట.
Healthy Beverages for Diabetics : డయాబెటిస్తో ఇబ్బంది పడేవారికి ఎలాంటి ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవాలన్నా భయమే. ఎందుకంటే అవి ఎక్కడ రక్తంలోని చక్కెర స్థాయిలు పెంచేస్తాయేమో అని భయం ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్‌తో బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు. కానీ ఖాళీ కడుపుతోనే వాటిని తీసుకోవాలట. అయితే ఈ డ్రింక్స్ కేవలం మధుమేహమున్నవారే కాదు.. మధుమేహం రాకూడదనుకునేవారు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయతో..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో.. నిమ్మరసం పిండి పరగడుపునే తాగాలి. ఈ డ్రింక్స్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా బరువు నిర్వహణలో హెల్ప్ అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
మెంతి నీరు
మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి మీరు రాత్రి పడుకునే ముందు.. మెంతి గింజలను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగవచ్చు.
ఉసిరి రసం
ఇండియన్ గూస్ బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది రెండు రకాలుగా పనికి వస్తుంది. కాబట్టి ఉసిరికాయలను మిక్సీ చేసి.. వాటి రసాన్ని షాట్‌గా తీసుకోవచ్చు.
కాకరకాయ రసం
షుగర్ పేషంట్లకు కాకరకాయ ఓ వరమని చెప్పవచ్చు. కాకరకాయలో ఇన్సులిన్ చర్యను అనుకరించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
కలబంద
ప్రతి ఇంట్లో ఉండే కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. చర్మ సంరక్షణకు, గాయలను దూరం చేయడానికి సహాయం చేస్తుంది. పైగా దీనిలో హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో తాగితే మంచిది. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయం చేస్తుంది.
తులసి టీ
హిందువులు పవిత్రంగా భావించే తులసితో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఇవి యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడం కోసం తాజా తులసి ఆకులతో టీని తయారు చేసుకోవచ్చు. ఇది రెగ్యూలర్‌గా తీసుకుంటే చాలామంచిది.
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కలను నీటిలో వేసి మరిగించి టీగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
ఈ డ్రింక్స్‌ని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ప్రభావాలు పొందవచ్చు. అందుకే ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి అంటున్నారు. ఇవి మధుమేహాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా.. పోషకాలను, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇవి ఎంత మంచివైనా.. మీరు ఉపయోగించాలి, తాగాలి అనుకున్నప్పుడు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి.
Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్‌ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.