అన్వేషించండి

Stroke Prevention Drinks : స్ట్రోక్ రాకుండా హార్ట్​ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి

Ayurvedic Drinks : ఆయుర్వేద లక్షణాలు కలిగిన కొన్ని డ్రింక్స్ శరీరంలో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా హార్ట్ స్ట్రోక్ సమస్యలనుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

Stroke Prevention Tips : గుండె సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటి మెరుగైన రక్తప్రసరణ(Blood Circulation) లేకపోవడం. ధమనుల లోపల రక్తం ప్రవహించడం కష్టంగా మారినప్పుడు అది గుండెపోటు లేదా స్ట్రోక్(Heart Stroke) వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్త సరఫరాలలో ఆటంకం కారణంగా మెదడు దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రమాద పరిస్థితులను నివారించడానికి.. శరీరంలో సహజంగా రక్తప్రసరణను మెరుగుపరచుకునేందుకు మనం ప్రయత్నించాలి. ఆయుర్వేదం ప్రకారం ఓ సహజమైన పద్ధతి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

కొన్ని మూలికలతో కూడిన పానీయాలు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగై స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఇవి కేవలం గుండె ఆరోగ్యాన్నే కాకుండా.. మెరుగైన శరీర పనితీరును అందిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకీ ఆ పానీయాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చుద్దాం. 

పాలలో పసుపు..

పసుపు ఆయుర్వేదంలో ఓ ప్రసిద్ధ మూలిక. దీనిలో అపారమైన శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి పసుపును.. గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఇది శరీరంలోని మంటను తగ్గించి.. రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీరు దీనిలో మిరియాల పొడిని కూడా కలిపి సేవించవచ్చు. దీనిని రాత్రుళ్లు నిద్రపోయే ముందు తాగితే మరింత మంచిది. మంచి నిద్ర కూడా మీ సొంతమవుతంది. 

అల్లం టీ

అల్లం శక్తివంతమైన హెర్బ్​గా చెప్పవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని సజావుగా నిరోధించడంలో అల్లంటీ మిరాకిల్స్ చేస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్లం టీని తయారు చేసుకుని.. హాయిగా ఆస్వాదించేయండి. వేడి నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించి.. వాటిని వడకట్టి దానిలో కాస్త తేనెను వేసుకుని అల్లం టీని ఆస్వాదించవచ్చు. 

దాల్చిన చెక్కతో.. 

వైవిధ్యమైన ఆరోగ్యప్రయోజనాలకు దాల్చినచెక్క పెట్టింది పేరు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కను నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత లేదా వేడిగా అయినా తీసుకోవచ్చు. 

బీట్ రూట్ జ్యూస్

బీట్​ రూట్​లో నైట్రేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రవహాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాలను విస్తరించడంలో సహాయం చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఉదయాన్నే లేదా రోజులో ఏదొక సమయంలో తాజా బీట్​ రూట్​ జ్యూస్​ని మీరు తీసుకోవచ్చు. ఇది స్ట్రోక్​ రిస్క్​ను తగ్గించి.. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 

ఉసిరి రసం

విటమిన్ సి ఉసిరి కాయల్లో పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇది రక్తనాళాలను పెంచడానికి, మెరుగైన రక్తప్రసరణను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. రోగనిరోధకశఖ్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే.. రక్తం గడ్డకట్టడాన్ని.. స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. 

రక్త ప్రసరణను మెరుగుపరచుకోవడానికి, గుండె సమస్యలను తగ్గించుకోవడానికి మీరు అశ్వగంధ టీ, తులసి టీలను కూడా తీసుకోవచ్చు. అయితే తులసి టీని మాత్రం పరగడుపునే తీసుకోవాలి. ఈ పానీయాలను రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల సహజంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. వీటితో పాటు వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం అనేవి కూడా సానుకూల ప్రభావాలు చూపిస్తాయి. 

Also Read : బెల్లీఫ్యాట్​ని కరిగించే కశ్మీరీ టీ.. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు ఏవంటే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
Pilates vs Strength Training : పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
Healthy Habits : రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Embed widget