Kashmiri Kahwa Tea : బెల్లీఫ్యాట్‌ని కరిగించే కశ్మీరీ టీ.. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు ఏవంటే
Drink for Belly Fat Loss : ఉదయాన్నే కశ్మీరీ టీ తాగితే.. బెల్లీఫ్యాట్ తగ్గడమే కాదు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట. మరి ఈ టీని దేనితో తయారు చేస్తారో తెలుసా?
Weight Loss Tea : మీ డేని హెల్తీ, టేస్టీ టీతో ప్రారంభించాలనుకుంటే మీరు కశ్మీరీ టీ తాగవచ్చు. దీనికి మరో పేరు కూడా ఉంది అదే కహ్వా టీ. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇది కశ్మీర్లో బాగా ఫేమస్ అయింది. దశాబ్దాలుగా దీనిని సేవిస్తున్నారు. దీనిలో కుంకుమపువ్వు, సుగంధ ద్రవ్యాలు, కశ్మీరీ గ్రీన్‌టీ, సీడ్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. రోగనిరోధకశక్తిని పెంచి.. కొవ్వును తగ్గించడంలో ఈ టీ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఈ కహ్వా టీని ఏవిధంగా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటి? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
దాల్చిన చెక్క - 1 అంగుళం చెక్క
యాలకులు - 2
లవంగాలు - 4
గ్రీన్ టీ - అర టీస్పూన్
బాదంపొడి - 1 టీస్పూన్
కుంకుపువ్వులు - 2
తేనె - 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. దానిలో నీరు వేసి వేడి చేయండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి నీటిని మరిగించండి. దానిలో గ్రీన్ టీ మూలికలు వేసి.. మూతపెట్టి వెంటనే స్టౌవ్ ఆపేయండి. గ్రీన్ టీని నీటిలో 3 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కప్పు తీసుకుని దానిలో బాదం పొడి వేయాలి. అలాగే రెండు కుంకుమపువ్వులు కూడా వేయాలి. ముందుగా తయారు చేసుకున్న టీని ఈ కప్పులో వడకట్టాలి. దానిలో తేనె వేసి బాగా కలిపాలి. అంతే హెల్తీ, టేస్టీ కశ్మీరీ టీ రెడీ. దీనిని మీరు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తాగవచ్చు.
ఈ టీ శరీరంలోని కొవ్వును ప్రధానంగా లక్ష్యం చేసుకుంటుంది. దానిని కరిగించి.. శరీరం నుంచి బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. ఈ టీని మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునే ముందు దీనిని తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది మీ జీర్ణ వ్యవస్థను, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీరు వేగంగా బరువు తగ్గడంలో, బొడ్డు చుట్టూ ఉనఅన కొవ్వును తగ్గించుకోవడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్టోర్ కాకుండా చేసి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు కూడా దీనిని తీసుకోవచ్చు. జలుబు, జ్వరం వంటి వాటిని ఇది దూరం చేస్తుంది. అంతేకాకుండా కఫం సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పిని దూరం చేసి.. చురుకుగా ఉండేలా ప్రేరేపిస్తాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయం చేసి.. మీరు రిలాక్స్‌గా ఉండేలా చూస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి.. సహజమైన గ్లో అందిస్తాయి.
Also Read : వ్యాయామం చేసేప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు కావొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.