Jitan Manjhi: బీహార్‌లో కేంద్ర మంత్రి మనవరాలి కాల్చివేత - భర్తే హంతకుడు !
Crime News: బీహార్‌లో కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలిని ఆమె భర్త కాల్చి చంపేశాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Union Minister Granddaughter Shot Dead: కేంద్ర మంత్రులు కుటుంబాల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు తుపాకీ కాల్పుల్లో మరణించారు. బీహార్‌లోని గయా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 32 ఏళ్ల సుష్మా దేవిని ఆమె భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. సుష్మా దేవి కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం రమేశ్ సింగ్ ఇంట్లో సుష్మాను గదిలో బంధించి స్థానికంగా తయారు చేసిన నాటు తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. హత్య తర్వాత రమేష్ సింగ్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మగధ్ ఆసుపత్రికి తరలించారు.
केंद्रीय मंत्री जीतन राम मांझी की नातिन की हत्या: पति ने सीने में मारी गोली। 14 साल पहले की थी अंतरजातीय शादी। गया पुलिस मामले की जांच में जुटी है।#JitanRamManjhi #MurderCase #GayaNews #BiharCrime #IntercasteMarriage #BreakingNews #BiharPolice #Bihar pic.twitter.com/yI86IVgAXZ
— FirstBiharJharkhand (@firstbiharnews) April 9, 2025
కుటుంబ వివాదాలు, వరకట్న వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
केंद्रीय मंत्री जीतन राम मांझी की नातिन की गोली मारकर हत्या कर दी गई है. मृतका की पहचान सुषमा देवी के रूप में हुई है. हत्या का आरोप सुषमा देवी के पति रमेश पर लगा है. फिलहाल पुलिस मामले की जांच कर रही है, और आरोपी पति की तलाश में छापेमारी कर रही है.#JitanRamManjhi | #MurderCase… pic.twitter.com/EPFucRabsz
— Matrize News Communications Pvt. Ltd (@Matrize_NC) April 9, 2025
గత నెలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సోదరి ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆయన ఇద్దరు మేనల్లుళ్లు తుపాకీలతో కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిత్యానందరాయ్ కూడా బీహార్‌కు చెందిన వారే. భాగల్‌పుర్ సమీపంలోని జగత్‌పుర్ గ్రామంలో ఆయన కుటుంబం ఉంటుంది. జీతన్ రామ్ మాంఝీ కుటుంబం మాత్రం గయలో ఉంటుంది. నిత్యానందరాయ్ మేనల్లుళ్లు జయ్‌జిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ మధ్య కొళాయి నీళ్లు పట్టే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఆ గొడవ పెద్దదై చివరకు కాల్పులచేసుకునే దాకా దారితీసింది.
బీహార్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న నాటు తుపాకుల కారణంగా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయన్న విమర్శలువస్తున్నాయి. కుటీర పరిశ్రమలా పెట్టుకుని తుపాకులు తయారు చేసి అమ్ముతున్నా ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయి.





















