Google: పని చెప్పకుండానే ఉద్యోగులకు జీతం ఇస్తున్న Google! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
Google: ఆర్థిక సంక్షోభంతో చాలా కంపెనీలు ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతోంది. కానీ గూగుల్ మాత్రం కొందరు ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పకుండానే జీతం చెల్లిస్తోంది.

Google: ఒకవైపు పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో Google తన ఉద్యోగులకు ఏడాది పాటు పనిచేయకుండానే జీతం ఇస్తుంది. నిజానికి Googleకు సంబంధించిన ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన వైరల్ అవుతోంది. వివిధ రకాల నివేదికల ప్రకారం, Google AI విభాగంలో పని చేసిన DeepMindలోని కొంతమంది ఇంజనీర్లకు ఎలాంటి పనిచేయకుండానే జీతం చెల్లిస్తోంది.
అసలు విషయం ఏంటి?
Business Insider నివేదిక ప్రకారం, DeepMindలోని కొంతమంది పాత ఉద్యోగులు ఇప్పటికీ కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్నారు. అయితే వాళ్లెవరూ ఇప్పుడు అక్కడ పని చేయడం లేదు. దీనికి కారణం noncompete agreement. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగి కంపెనీని వదిలిన తర్వాత మరొక పెద్ద కంపెనీలో పనిచేయకుండా అగ్రిమెంట్‌పై సైన్ చేస్తారు. ఇలాంటి అగ్రిమెంట్‌పై సైన్ చేసిన ఉద్యోగి కొన్ని నెలల పాటు ఎక్కడా పని చేయడానికి లేదు.
DeepMindలోని ఇటువంటి ఉద్యోగులను "extended Garden Leave"పై ఉంచారు. అంటే వారు ఆ కంపెనీలో భాగం కాదు. అయినప్పటికీ వారికి ఏడాదిగా పని చేయకుండానే గూగుల్ జీతం ఇస్తోంది. వారు గూగుల్‌తోపాటు, వేరే ఏ కంపెనీలో పని చేయకుండానే జీతం వస్తుంది.
ఒకవైపు OpenAI, Meta, HP, Microsoft వంటి పెద్ద పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. మరోవైపు పని చేయని వాళ్లకు మాత్రం Google జీతాలు ఇస్తోంది. DeepMindలోని ఒక మాజీ ఉద్యోగి ఏమంటున్నారంటే "AI ప్రపంచంలో ఒక సంవత్సరం చాలా విలువైన కాలం. వాళ్లు ఏడాది పాటు ఎక్కడా పని చేయకపోవడంతో టెక్నాలజీలో వారంతా వెనకబడిపోవచ్చు. జీతాల విషయంలో కూడా వారికి అన్యాయం జరుగుతుంది" అని అన్నారు.
Google ప్రతిస్పందన ఏంటి?
Google తన కాంట్రాక్ట్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. కంపెనీ తన భద్రత కోసం ఈ noncompete clausesని ఉపయోగించుకుంటుంది. కొంతమంది ఉద్యోగులకు ఈ షరతులు నచ్చవు.
గూగుల్ తన మేధో సంపత్తిని, వ్యాపార రహస్యాలను రక్షించుకోవడానికి నాన్- కంపీట్ అగ్రిమెంట్ విధానం అమలు చేస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఈ సంస్థ కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తోంది. ఇలాంటి విషయాలు చాలా సిక్రెట్‌గా ఉంచుంది. అందుకే ఈ విభాగాల్లో పని చేసే వాళ్లు ఏడాది పాటు మరో పోటీ కంపెనీల్లో పని చేయకుండా నిరోధించేందుకు ఈ ప్రయత్నం. ఇలా చేయడం వల్ల పోటీని నివారించి ఆధిపత్యం చేజారిపోకుండా చేస్తుంటాయి. కంపెనీ ఆలోచనలు ఇతర అప్‌డేట్స్ లీక్ కాకుండా చూసుకుంటుంది. ఇందులో చట్టబద్ధమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఇలాంటి ఉద్యోగులకు జీతం చెల్లిస్తూ ఉంటుంది.
ఇది ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందనే విమర్శలు ఉన్నాయి. దీని వల్ల ఆ ఉద్యోగుల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. ఇలా ఏడాది పాటు ఉద్యోగి ఎలాంటి పని లేకుండా ఉంటే... మిగతావారితో పోల్చుకుంటే చాలా వరకు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన విధానంతో ఉద్యోగులు బలిపశవులు అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

