News
News
X

Petrol GST : జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ ! అడ్డుకుంటోంది రాష్ట్రాలా ? కేంద్రమా ?

పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి చేరుస్తామన్నట్లుగా హడావుడి చేసిన కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అలాంటి చాన్స్ లేదని తేల్చేసింది. జీఎస్టీలోకి ఎప్పుడు తెస్తారు ? తేకుండా ఎవరు అడ్డుకుంటున్నారు ?

FOLLOW US: 

జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ ధరలను తీసుకు వచ్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామన్నట్లుగా గత వారం రోజులుగా మీడియాకు లీకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అసలు సమావేశంలో మాత్రం లైట్ తీసుకుంది. లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈమేరకు పెద్దగా చర్చ లేకుండానే తేల్చేశారు. ఇప్పుడే సమయం కాదని నిర్మలా సీతారామన్,  తమ ఆదాయం పడిపోతుందని రాష్ట్రాలు తేలిగ్గా తీసుకున్నాయి. దీంతో పెట్రో భారం నుంచి ప్రజలకు ఉపశమనం లేదని తేలిపోయింది.

జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ పరిధిలోకి తెస్తే అత్యధిక శ్లాబ్ రేటు 28శాతం కింద పరిగణించినా పెట్రోల్ రేటు 30 రూపాయల వరకూ తగ్గిపోతుందనే విశ్లేషణ ఉంది. ఆ మేరకు ప్రభుత‌్వాలకు ఆదాయం తగ్గిపోతుంది. ఆ లోటును కేంద్రం భర్తీ చేయాలి. జీఎస్టీలో పెట్రోలు, డీజిల్‌ను చేర్చేడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతోంది. జీఎస్టీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భరిస్తామని చట్టంలో పేర్కొన్నారు.  ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీలోకి చేర్చి ఆ నష్టాన్ని కూడా.. రాష్ట్ర ప్రభుత్వాలకు భర్తీ చేయాల్సి ఉటుంది. ఇస్తామంటే రాష్ట్రాలు ఒప్పుకుంటాయి. కానీ కేంద్రం అలా ఇవ్వడానికి  ఏమాత్రం సిద్ధపడటం లేదు. కేంద్రం ప్రభుత్వం ఏడాదికి రూ. మూడు లక్షల కోట్లకుపైగానే  పెట్రో ఆదాయాన్ని పొందుతోంది.  ఇప్పుడు జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్‌ను చేర్చితే భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. ఓ వైపు తమ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. Also Read : వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ రికార్డు.. ప్రధాని మోడీకి బర్త్ డే గిఫ్ట్ గా 2.5 కోట్ల టీకాలు పంపీణీ

 పెట్రోల్, డీజిల్ ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. 2014కి ముందు అంటే మోడీ ప్రధానికాక ముందు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 140 డాలర్ల వరకు ఉంది. ఆ తర్వాత ఓ దశలో అది 25 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత కొంచెం పెరిగింది. ఇప్పుడు 70 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. 2014తో పోలిస్తే క్రూడాయిల్ ధరలు పడిపోయినా.. ఆ ప్రయోజనం  ప్రజలకు బదలాయించలేదు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పది సార్లు ఎక్సయిజ్ టాక్స్ పెరిగింది. ఎప్పుడూ తగ్గించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు ట్యాక్స్‌ల పెంపుతో సరి పెట్టారు . పెరిగినప్పుడు మాత్రం ప్రజలపై వడ్డిస్తున్నారు. అందుకే వంద దాటిపోయింది. పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. Also Read : అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?

నిజానికి కేంద్రప్రభుత్వం జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తుల్ని తెస్తామని .. జీఎస్టీ చట్టం తెచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నారు.  కానీ తేవడం లేదు. తాము జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని తేవాలనుకున్నా రాష్ట్రాలే అడ్డుకున్నాయని చెబుతూ వస్తోంది. ఇప్పుడూ అదే చెబుతోంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఎప్పటికప్పుడు నిరాశగా మారుతున్నాయి. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?

Published at : 18 Sep 2021 12:53 PM (IST) Tags: nirmala sitaraman GST petrol gst counsil

సంబంధిత కథనాలు

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

TS EAMCET Results 2022 : నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు

TS EAMCET Results 2022 : నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు

టాప్ స్టోరీస్

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?