(Source: ECI/ABP News/ABP Majha)
Jogi Ramesh : అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?
వైసీపీ ఎమ్మెల్యేలందరూ సైలెంట్‌గా ఉంటే జోగి రమేష్ మాత్రమే చంద్రబాబు ఇంటిని ఎందుకు ముట్టడించారు ?పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నా జోగి రమేష్‌ను మాత్రమే ఇన్వాల్వ్ చేశారా? ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారా ?
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటి ముట్టడికి కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించడం .. అక్కడ జరిగిన రచ్చ వివాదాస్పదం కావడం అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాశం అయింది. అయ్యన్న వ్యాఖ్యలను చూసి ఆయన స్వతహాగా ఆవేశ పడ్డారా? లేకపోతే పార్టీ పెద్దలు ఎవరైనా చెప్పారా ? అన్న సందేహం ఆ పార్టీ నేతల్లో వస్తోంది. అయితే ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేనే సొంత నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
జోగి రమేష్ సొంత నిర్ణయమా ? హైకమాండ్ సూచించిందా ?
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచరుల్ని తీసుకుని చంద్రబాబు ఇంటికి ముట్టడిగా వెళ్లిన దృశ్యాలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యాంగ్ వార్ తరహాలో చంద్రబాబు ఇంటిపైకి పరుగులు పెడుతున్న వైసీపీ కార్యకర్తల దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఓ ప్రతిపక్ష నేత ఇంటిపైకి అలా వెళ్లగలిగారంటే ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగుతుంది. శాంతిభద్రతల అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తెరపైకి తెస్తాయి. ఆ విషయం రాజకీయాల్లోనే పుట్టి పెరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియనిది కాదు. అలాంటి అవకాశం ఉందని తెలిసినా జోగి రమేష్ ఎలా మనుషుల్ని తీసుకుని చంద్రబాబు ఇంటిపైకి వెళ్లగలిగారనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతున్న చర్చ. Also Read : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?
ఇతర ఎమ్మెల్యేలెవరికీ అయ్యన్న వ్యాఖ్యలపై కోపం రాలేదా ?
ఆయనకు వైసీపీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకే వెళ్లారని కొంత మంది నేతలు చెబుతున్నారు. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ ఆగ్రహం తెప్పించి ఉంటే చంద్రబాబు ఇల్లు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. గుంటూరు జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు ఉన్నారు. విజయవాడ నగరంలోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారెవరూ తమ అనుచరులతో రాలేదు. పెడన నుంచి జోగి రమేష్ మాత్రమే తన అనుచరులతో కాన్వాయ్‌గా చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఇతర నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళనలకు రాలేదు. దీంతో ఒక్క జోగి రమేష్‌కు మాత్రమే చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని హైకమాండ్ సూచించిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?
ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసీ జోగి రమేష్ అలా చేస్తారా ?
దానికి సాక్ష్యంగా పోలీసుల తీరును కూడా కొంత మంది చూపిస్తున్నారు. ఉండవల్లి, తాడేపల్లి హై సెక్యూరిటీ జోన్లు, ఎక్కడ ఎవరైనా ముట్టడికి వెళ్తున్నారంటే పోలీసులు అడ్డుకుంటారు. కానీ జోగి రమేష్ కార్ల కాన్వాయ్ కర్రలు, జెండాలతో కరకట్టపైకి వెళ్తున్నా ఆపలేదు. పోలీసులు కాస్త ఆలస్యంగా అక్కడుకు చేరుకున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగిందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా జోగి రమేష్‌ను చంద్రబాబు ఇంటివద్ద ధర్నాకు వెళ్లాలని హైకమాండ్ ఎలా చెబుతుందని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ముట్టడిచేయాలనుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలందరికీ పిలుపునిచ్చేవారు కదా అని అంటున్నారు. Also Read : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... మళ్లీ నైట్ కర్ఫ్యూ పొడిగింపు...
మంత్రి పదవి కోసం జగన్‌ను ఇంప్రెస్ చేసేందుకు చేశారా ?
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు మంత్రి పదవి చేపట్టాలనేది లక్ష్యం. రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగించి కొత్త వారిని తీసుకుంటామని ప్రమాణస్వీకారం అప్పుడే జగన్ చెప్పారు. ఆ సమయం దగ్గర పడుతోంది. కృష్ణా జిల్లా నుంచి తను అవకాశం పొందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేసేందుకు జోగి రమేషే సొంత నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అసెంబ్లీలో రఘురామకృష్ణరాజుపై అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ను జోగి రమేష్ వాడారు. అప్పుడు సీఎం జగన్ ఆయనను అభినందించారు.
Also Read : రౌడీయిజం మీదంటే మీది ! ఉండవల్లి ఘటనపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పరస్పర విమర్శలు !