Guardian OTT Streaming: ఏడాది తర్వాత ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులో వచ్చేసిన హన్సిక 'గార్డియన్', స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Guardian OTT Platform: టాలీవుడ్ బ్యూటీ హన్సిక నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'గార్డియన్' ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

Hansika Guardian Streaming On Aha: హారర్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ కోసం ఓటీటీలు అలాంటి కంటెంట్‌నే అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా.. మరో హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏడాది తర్వాత తెలుగులో..
టాలీవుడ్ బ్యూటీ హన్సిక (Hansika) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'గార్డియన్' (Guardian). గతేడాది విడుదలైన ఈ మూవీ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో (Aha) స్ట్రీమింగ్ అవుతోంది. శబరి, గురు శరవనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ 'ఆహా తమిళ్', 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ విజయ్ చందర్ ఈ సినిమాను నిర్మించారు.
అసలు స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ స్టోరీ ఓ ఆత్మ కథ చుట్టూ తిరుగుతుంది. అపర్ణ (హన్సిక) ఓ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచీ ఆమె పేరు అన్ లక్కీగా మారిపోతుంది. ఓ ప్రమాదంలో గాయపడిన ఆమె జీవితం మలుపులు తీసుకుంటుంది. అపర్ణను ఆవహించిన ఆత్మ ఆ శరీరంతో నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిని చంపుతుంటుంది. అసలు వారిని చంపడానికి కారణం ఏంటి?, చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు?, అపర్ణ శరీరంలోకి ఆత్మ ఎలా ప్రవేశించింది?, ఆ ఆత్మకు సహాయం చేసిందెవరు? వంటి వివరాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో విజువల్స్ ప్రేక్షకులను అలరించాయి. సామ్ సీఎస్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





















