Today OTT Releases: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్! - విక్రమ్ 'వీర ధీర శూరన్', మోహన్ లాల్ 'L2: ఎంపురాన్', ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Latest OTT Streamings: ఒకే రోజు బ్లాక్ బస్టర్ మూవీస్ పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. చియాన్ విక్రమ్ నటించిన 'వీర ధీర శూరన్', మోహన్ లాల్ నటించిన 'L2: ఎంపురాన్' మూవీస్ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Latest Telugu OTT Streamings: ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకటి మలయాళం.. మరొకటి తమిళం కాగా రెండూ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూరన్', మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన 'L2: ఎంపురాన్' ఓటీటీలోకి వచ్చేశాయి.
థియేటర్లలో విడుదలైన నెల లోపే..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూరన్' (Veera Dheera Sooran) ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్ పంచుకుంది. 'విముక్తి నుంచి ప్రతీకారం వరకూ.. ఒక రాత్రి ప్రతిదీ మారుస్తుంది.' అని తెలిపింది. ఈ మూవీ మార్చి 27న థియేటర్లలకో విడుదల కాగా.. తమిళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.
From redemption to revenge, one night changes everything 🔥#VeeraDheeraSooranOnPrime, Watch Now: https://t.co/eeUJb9rSjD pic.twitter.com/X2nZaoDOJG
— prime video IN (@PrimeVideoIN) April 23, 2025
ఈ సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించగా.. విక్రమ్ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
స్టోరీ ఇదే?
గ్రామంలో ఓ కిరాణా కొట్టు నడుపుకొంటున్న కాళి (విక్రమ్), తన భార్య వాణి (దుషారా విజయన్), పిల్లలతో ప్రశాంత జీవనం సాగిస్తుంటాడు. అంతకు ముందు ఊళ్లో రవి (30 ఇయర్స్ పృథ్వీ) అనే పెద్ద మనిషి దగ్గర నమ్మకమైన అనుచరుడిగా పని చేస్తుంటాడు. చాలా గొడవల్లో తలదూరుస్తూ రవికి అండగా ఉంటూ చెప్పిన పనులు చేసేవాడు. అయితే, అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న సమయంలోనే రవి.. కాళి దగ్గరకు వచ్చి.. తనను, తన కొడుకును కాపాడాలని వేడుకుంటాడు.
ఎస్పీ అరుణగిరి (ఎస్‌జె సూర్య) తనను, తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటున్నట్లు కాళికి చెప్తాడు రవి. ఎస్పీని చంపాలని సాయం కోరతాడు. అందుకు కాళి ఒప్పుకొన్నాడా?, ఎస్పీకి, రవికి మధ్య వైరం ఏంటి?, పాత గొడవలకు, వీరిని ఎన్‌కౌంటర్ చేయాలనుకోవడానికి, కాళికి సంబంధం ఉందా?, తన కుటుంబం జోలికి వచ్చిన వారిని కాళి ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
మోహన్ లాల్ 'L2: ఎంపురాన్'
మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటించిన 'L2: ఎంపురాన్' (L2: Empuraan) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
హిందీ వెర్షన్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ డేట్ నుంచి 8 వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 'ఎంపురాన్' మూవీ రిలీజ్ తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ.270 కోట్లు వసూలు చేసింది.
వీటితో పాటే అమెరికన్ అడ్వెంచర్ డ్రామా 'ఏ డాగ్స్ వే హోమ్' మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లోకి గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చార్లెస్ మార్టిన్ స్మిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. బెల్లా అనే కుక్క చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
'యూ' సీజన్ వెబ్ సిరీస్
సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'యూ' (You Season) సీజన్ 5 ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తనకు అడ్డం వచ్చే వారిని చంపేసే జో గోల్డ్ బర్గ్ అనే కిల్లర్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. కరోలిన్ కెప్నెస్ రచించిన 'యూ' అనే నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్‌లో పెన్ బాడ్ గ్లేతో పాటు చార్లెట్ రిచీ, బ్రేవర్, నటాషా బెహ్మన్, పెటే ప్లోజెక్, టామ్ ఫ్రాన్సిన్, నవా మవూ కీలక పాత్రలు పోషించారు.





















