Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Vidadala Rajini: క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిని ఒక్కొక్కర్ని కూటమి ప్రభుత్వం లోపల వేస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిదిని అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లా యడ్లపాడులో కంకర క్వారీ విషయంలో యజమానులను బెదిరించిన కేసులో విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల క్రితం కేసులు పెట్టారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో విడదల రజిని పేరు కూడా ఉంది. ఆమె ప్రోత్బలంతోనే గోపీ యజమానులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేశారన్నది కేసు. హైదరాబాద్‌లో గోపిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరంం విజయవాడ తరలించారు. అక్కడ ప్రాథమిక విచారణ చేసి అనంతరం కోర్టులో హజరుపరుస్తారు.
పల్నాడు జిల్లాల యడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను గోపీ బెదిరించారని ప్రధాన ఆరోపణ. బెదిరించి 2.20 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. విజిలెన్స్ సోదాల పేరుతో ఇదంతా జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో మాజీ మంత్రి విడదల రజిని పేరు కూడా యాడ్ చేయడంలో వివాదం రాజకీయరంగు పులుముకుంది.
ఇదంతా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి విడదలరజినీ ఆరోపించారు. అప్పట్లో ఫిర్యాదు చేయకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదులు చేస్తుంటేనే ఇది ఏ స్థాయి కక్ష సాధింపో అర్థమవుతుందని అన్నారు. గోపీ పేరుతో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి విడదల రజినీ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడింది.
మాజీ మంత్రి విడదల రజిని కుటుంబంపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్షసాధింపులు
— YSR Congress Party (@YSRCParty) April 24, 2025
విడదల రజిని మరిది గోపీనాథ్‌ను అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
హామీలపై ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్ట్‌లతో బెదిరింపులా @ncbn ?#CBNFailedCM#TDPGoons#IdhiMunchePrabhutvam#SadistChandraBabu… pic.twitter.com/SWj4FzehGn





















