Covid 19 Vaccination: వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ రికార్డు.. ప్రధాని మోడీకి బర్త్ డే గిఫ్ట్ గా 2.5 కోట్ల టీకాలు పంపీణీ
టీకా పంపిణీలో భారత్ రికార్డు సృష్టించింది. ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ఇండియాలో 2.5 కోట్ల టీకాలు వేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్ డోసులను అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకుంది. అయితే అనూహ్యంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా భారతదేశంలో ఒక్కరోజులోనే 2.5 కోట్ల కొవిడ్ టీకాలు వేశారు. ఈ విషయాన్ని రాత్రి 11:58 గంటలకు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా వీలైనంత ఎక్కువగా ఎక్కువగా టీకా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ కార్యక్రమం విజయవంతమైంది. 2.5 కోట్ల టీకాలతో భారత్ రికార్డు సృష్టించింది. మధాహ్నం 1.30 వరకు కోటి డోసులు అందివ్వగా.. మరో 4 గంటల్లో కోటి టీకాలు ఇచ్చారు. రాత్రి వరకు 2.5 కోట్ల టీకాలు వేశారు.
ఒక్కరోజులో 2.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసి భారత్.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ ఘనత సాధించిందని.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.
Congratulations india!
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021
PM @NarendraModi जी के जन्मदिवस पर भारत ने आज इतिहास रच दिया है।
2.50 करोड़ से अधिक टीके लगा कर देश और विश्व के इतिहास में स्वर्णिम अध्याय लिखा है।
आज का दिन हेल्थकर्मियों के नाम रहा। #HealthArmyZindabad pic.twitter.com/F2EC5byMdt
చైనా ఒక రోజులో అత్యధిక 2.47 కోట్ల టీకాలను జూన్ లో వేసింది. అంతకుముందు.. సెప్టెంబర్ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్లో కోటి మార్కును చేరింది భారత్. తొలి 10కోట్ల డోసుల పంపిణీకి 85 రోజుల సమయం పట్టింది. అనంతరం 20 కోట్ల మార్కుకు 45రోజులు, 30కోట్ల మార్కుకు 29రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24రోజుల్లోనే 40కోట్లు, 20రోజుల్లో 50కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ దేశంలో 79 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. వచ్చేనెల నాటికి అదీ 100 కోట్లకు చేరే అవకాశం ఉంది.
Thank you all Health Workers.
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021
Well Done India! 😊 pic.twitter.com/l7K7R9ZEtm
Also Read: