News
News
X

Bangalore News: ఆకలికి తట్టుకోలేక ఆగిన పసి గుండె... నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య... మరోచోట చిన్నారిని హత్య చేసిన కసాయి తండ్రి

గుండెల్ని పిండేసే రెండు విషాద ఘటనలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో ఆకలి తాళలేక ఓ పసిప్రాణం పోయింది. ఓ కసాయి తండ్రి రెండేళ్ల చిన్నారిని హత్యచేశాడు.

FOLLOW US: 

ఇద్దరు పసివాళ్లను విధికి వదిలేసి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆకలికి తట్టుకోలేక ఒక పనివాడు చనిపోయిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. బెంగళూరు తిగళరపాళ్య చేతన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న శంకర్‌ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాలని ఇంటి పెద్ద కుమార్తెకు చెప్పడంతో ఈ పెనువిషాదానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధురాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు. 

సించనకు తొమ్మిది నెలల కుమారుడు, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆకలి తట్టుకోలేక పసివాడు ప్రాణాలు విడిచాడు. ఆమె కుమార్తె ప్రేక్ష స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో కాన్పున కోసం పుట్టింటికి వచ్చిన సించన పండంటి మగబిడ్డ జన్మనిచ్చింది. తిరిగి అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్‌ కోరుతున్నారు. ఈ విషయంపై కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. తన మాటను ఇంట్లో ఎవరు పట్టించుకోవడంలేదని శంకర్‌ ఇంటి నుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన కిటికీ తెరిచి చూసి జరిగిన విషాదాన్ని గుర్తించారు. వీరంతా 5 రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Nellore Crime: గొంతులో బఠాణీ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి.. కంటతడి పెట్టిస్తున్న ఘటన

చిన్నారిని చిదిమేసిన తండ్రి

అన్యం పుణ్యం తెలియని రెండేళ్ల చిన్నారిని చిదిమేశాడో ఓ కసాయి తండ్రి. అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కు చెందిన హాసిబ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం హస్రత్ బేగంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. హాసిబ్‌ గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యకారణాలతో ఇంట్లోనే ఉంటున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం తన కుమారుడిని హాసిబ్ హత్యచేశాడు. పెద్ద కుమారుడు ఇస్మాయిల్ (2) ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని భార్య హస్రత్ బేగం జరిగిన ఘటనను గమనించి వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కుమారుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

Also Read: AP EDCET 2021: 21న ఏపీ ఎడ్‌సెట్‌.. 24 నుంచి పీఈసెట్.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌లు ఇవే..

Published at : 18 Sep 2021 08:11 AM (IST) Tags: TS News karnataka Hyderabad News Bangalore family suicide father murdered son

సంబంధిత కథనాలు

Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!

Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి