అన్వేషించండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్

Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌లో భారత్ సంబంధిత కీవర్డ్స్ ట్రెండ్ అవుతున్నాయి. జనం ఆందోళన, ఆసక్తి చూపిస్తున్నారు.

Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్‌లో కూడా వాతావరణం వేడెక్కింది. మంగళవారం అంటే ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిపై ఒకవైపు భారతదేశంలో కోపం, ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు జరుగుతున్న చర్చల్లో పాల్గొంటున్నారు. భారత్ చేపట్ట చర్యల గురించి తెలుసుకుంటున్నారు.  

ఈ దాడి తరువాత పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)  గూగుల్‌లో  దీనికి రిలేటెడ్‌గా ఉండే  కీవర్డ్స్‌  వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని ప్రజలు పెద్ద సంఖ్యలో ‘Pahalgam’, ‘Pahalgam attack’, ‘Kashmir’, ‘Modi’, ‘Pulwama’ ‘Jammu’ వంటి పదాల గురించి వెతుకుతున్నారు.

సోషల్ మీడియాలో పాకిస్తాన్‌లో ..

ఈ ఉగ్రవాద ఘటన తరువాత భారతీయ సోషల్ మీడియాలో #PahalgamTerroristAttack,  #Modi వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, పాకిస్తాన్‌లో కూడా ఈ దాడిపై ప్రజల ఆసక్తి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారులు ఈ దాడిపై వేర్వేరుగా స్పందిస్తున్నారు. 

పాకిస్తాన్ ప్రభుత్వం ఏమి చెప్పింది?

ఈ దాడిపై పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయితే, సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారుల ప్రతిస్పందన ద్వారా ఈ ఘటన అక్కడ కూడా కలకలం రేపిందని స్పష్టమవుతోంది.

భారతదేశం ఘాటు ప్రతిస్పందన

అదే సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని భారతదేశం సహించదని ఆయన అన్నారు. అంతేకాదు దానికి తగిన ప్రతిస్పందన ఇస్తుందని అన్నారు. అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాడ సంతాపం తెలిపారు. 

ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'ఈ దాడి అమానుషమైనది మాత్రమే కాదు,  సిగ్గుచేటు ప్రయత్నం. దీనికి స్పందన కచ్చితంగా బలంగా ఉంటుంది. చేసిన వాళ్లనే కాకుండా దీని వెనుక ఉన్న వారిని కూడా బయటకు లాగుతాం' అని అన్నారు.

గూగుల్ ట్రెండ్స్ లో  పాకిస్తాన్ మూడ్ కనిపిస్తోంది

గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న కీవర్డ్‌లు భారతదేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా పహల్గాం దాడికి సంబంధించిన వివరాలు  తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. సెర్చ్ ట్రెండ్స్ ద్వారా పాకిస్తాన్ పౌరులు భారత్-పాక్ సంబంధాలపై దీని ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతున్నారని వెల్లడైంది. 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget