Ishan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam
ఇషాన్ కిషన్ అవుటా నాటౌటా. నాటౌట్ అయితే తనే ఔట్ అయిపోయా అని తనంతట తనే ఎందుకు వెళ్లిపోయాడు. అంపైర్లు కూడా షాక్ అయ్యేలా ఇషాన్ కిషన్ ప్రవర్తించిన తీరు దేనికి సంకేతం. ఐపీఎల్ అంటేనే ఓ బిజినెస్ అని...అదెప్పుడూ కమర్షియల్ గానే ఉంటుందని...అక్కడ నిజమైన క్రికెట్ తావులేదనేది ఓ వర్గం ఎప్పుడూ చేసే ఆరోపణ. వందల సంఖ్యలో వర్థమాన క్రికెటర్లు వస్తున్నా ఈ ఐపీఎల్ ను ఎప్పుడూ వెంటాడేది ఫిక్సింగ్ భూతం. ఐపీఎల్ మనకు కనిపించేంత అందమైన ఆట కాదు అనేది దాని వెనుక ఓ పెద్ద మాఫియా ఉందనేది తరచూ వినిపించే విమర్శ. రాజస్థాన్, చెన్నై లాంటి జట్లు రెండేళ్ల పాటు ఈ ఫిక్సింగ్ ఆరోపణలపైనే ఐపీఎల్ కు దూరమయ్యాయి. ఇప్పుడు ఆ విమర్శలకు మళ్లీ పదును పెట్టేలా ఇషాన్ కిషన్ వ్యవహారం దుమారం అవుతోంది. నిన్న ముంబైతో ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ దీపక్ చాహర్ బౌలింగ్ లో ఓ బంతిని ఎదుర్కొన్నాడు. అయితే అది తన బ్యాట్ కు తగిలిందని భావించిన ఇషాన్ కిషన్ బౌలర్ అప్పీల్ చేయకపోయినా క్రీజు వదలి పెవిలియన్ వైపు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోవటం మొదలుపెట్టాడు. ఇషాన్ కిషన్ కదలికలను చూసి దీపక్ చాహర్ ఔట్ అప్పీల్ చేస్తే వైడ్ ఇవ్వటానికి సిద్ధపడిన అంపైర్ షాక్ అయ్యి అవుట్ ఇచ్చాడు. అంతా అనుకున్నారు ఇషాన్ కిషన్ నిజాయితీ తను ఔట్ అని ఒప్పుకుని క్రీజు వదిలివెళ్లిపోతున్నాడని పాండ్యా సహా ప్రతీ ఒక్కరూ వెళ్లిపోతున్న ఇషాన్ ని అప్రిషియేట్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కి ఫెయిర్ ప్లే పాయింట్స్ కూడా వస్తాయి అనుకున్నారు. కానీ రీ ప్లేలో చూసినప్పుడు తేలింది ఏంటంటే అసలు బంతి ఇషాన్ కిషన్ బ్యాట్ కి కాదు కదా థై ప్యాడ్ కి కూడా తగల్లేదు. మరీ దేనికి తగలనప్పుడు ఇషాన్ కిషన్ దేనికి అవుట్ అని తనే డిక్లేర్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇదే వివాదస్పదమవుతోంది. రెండోది అంపైర్ కూడా ఫస్ట్ వైడ్ ఇద్దామనకున్నాడని అంతా భావించారు. కానీ రీప్లేలో చూస్తే ఆయన తన కుడిచేతిని మాత్రమే పైకి లేపుతున్నారు. అంటే నో బాల్ ఇద్దామనుకున్నారా ఒకవేళ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యి ఉంటే. ఇషాన్ కిషనే వెళ్లిపోతున్నాడు కాబట్టి అవుట్ ఇచ్చారా. లాట్ ఆఫ్ కన్ఫ్జూన్. గాడ్ నోస్ వాట్ హేంపెడ్. సోషల్ మీడియా మాత్రం ఈ ఘటనపై ఏకి పారేస్తోంది. కిషన్ తెలివితక్కువ నిర్ణయంతో సన్ రైజర్స్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దాని ప్రభావం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆఖరకు మ్యాచ్ ఓడిపోయేలా టీమ్ ను టర్న్ చేసిందనేది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆవేదన. ఇషాన్ కిషన్ ముంబై మాజీ ఆటగాడు కాబట్టి ఆ టీమ్ తనతో మాట్లాడుకుందని అందుకే ఇలా చేశాడని ఇదంతా డబ్బు మహిమ అని ఎప్పుడూ ఐపీఎల్ ని ఫిక్సింగ్ భూతంలా చూసే వాళ్లు యాజ్ యూజువల్ గా డ్యూటీ ఎక్కేశారు.





















