Pahalgam Terrorist Attack: రక్షించాలని ఆర్తనాదాలు, వదిలేయాలని వేడుకోలు- వెలుగులోకి వచ్చిన పహల్గామ్ దాడి మొదటి వీడియో
Pahalgam Terrorist Attack:పహల్గామ్‌లో ఉగ్రదాడి నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్న విషయాలు షాక్‌కి గురి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న వీడియోలు, ఫొటోలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.

Pahalgam Terrorist Attack: దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయ. సుందరమైన పర్యాటక ప్రాంతంలో బుధవారం జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కలచి వేసింది. బంధువులను, అయినవారిని కోల్పోయిన కుటుంబాల రోధనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దని జనం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు జరిగిన ఘోరకలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు ఆ రోజు జరిగిన దుర్ఘటన, ఉగ్రమూకలు తమ పట్ల వ్యవహరించిన తీరును కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పర్యాటకులను లక్ష్యాంగా చేసుకునేందుకు లష్కర్ ఏ తైయబా (LeT)తో సంబంధం ఉన్న ముఠా ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో భయంతో వణికిపోయింది. వాళ్లంతా వద్దని వేడుకుంటున్నా పర్యాటకులనే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు ఉగ్రవాదులు. ఉగ్రమూకల దుష్టచర్యకు 26 మంది ప్రాణాలు వదిలేశారు. అనేక మంది గాయపడ్డారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నటైంలో ఉగ్రమూకలు కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఆ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ క్షణంలో ఏం జరిగిందనే విషయాన్ని ఓ వీడియో స్పష్టంగా చెబుతోంది. ఈ వీడియోలో ఓ ముఠా పర్యాటక ప్రాంతంలోకి రావడం, కాల్పులు జరపడం కనిపిస్తోంది. వీడియో తీసే వ్యక్తి కూడా భయంత వణికిపోతున్న విషయాన్ని గమనించవచ్చు. అయితే ఈ వీడియోను చాలా దూరం నుంచి షూట్ చేసినట్టు తెలుస్తోంది. మతిచెడిన అరాచక శక్తులు కాల్పులు జరుపుతున్న దృశ్యం, భయంతో పరుగులు పెడుతున్న పర్యాటకులు ఆ వీడియోలో కనిపిస్తున్నారు.
View this post on Instagram
వృద్ధులు, హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంటల ఎవర్నీ కూడా వదల్లేదు. పెళ్లై వారాలు కూడా కాలేదు అలాంటి రెండు జంటలను ఉగ్రమూకలు బలి తీసుకున్నాయి. దీంతో వారి జీవితాల్లో విషాదం అలుముకుంది. కళ్ల ఎదుటే భర్తలను చంపుతుంటే ఆ భార్యల పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. వదిలేయాలని ప్రాథేయపడ్డా వినిపించుకోలేదా ఉగ్రదుర్మార్గులు. భర్తలను చంపేసి భార్యలను వదిలేసిన ఉగ్రవాదులు... మోదీకి చెప్పుకోండని కూడా సవాల్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు.





















