Uttar Pradesh News: బైక్ చక్రంలో ఇరుక్కుపోయిన కోతి- ఎంత కష్టం వచ్చింది!
Uttar Pradesh News: బైక్ చక్రంలో కోతి ఇరుక్కుపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![Uttar Pradesh News: బైక్ చక్రంలో ఇరుక్కుపోయిన కోతి- ఎంత కష్టం వచ్చింది! Uttar Pradesh News Monkey gets stuck in wheel of speeding bike In Badosarai, rescued later Uttar Pradesh News: బైక్ చక్రంలో ఇరుక్కుపోయిన కోతి- ఎంత కష్టం వచ్చింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/1c0a73b0c2eb9d74c37254f078b810001667973094620218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uttar Pradesh News: ఎవరైన అల్లరి ఎక్కువ చేస్తే "కోతి చేష్టలు", "కోతి పనులు" అంటూ తిడుతూ ఉంటారు. ఎందుకంటే కోతులు (Monkey) చేసే తుంటరి పనులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ కోతి చేసిన పని దాని ప్రాణంపైకి వచ్చింది. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ ఓ కోతి అనుకోకుండా బైక్ ముందు చక్రం మధ్యలో ఇరుక్కుపోయింది.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ బదోసరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ వేగంగా వెళ్తోన్న సమయంలో ఓ కోతి (Monkey) సడెన్‌గా రోడ్డు దాటబోయింది. ఆ సమయంలో అనుకోకుండా ఆ కోతి బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన ఆ బైకర్.. వెంటనే బండిని ఆపేశాడు.
బైక్ చక్రం నుంచి బయటపడడానికి ఆ కోతి చాలా ఇబ్బంది పడింది. చివరికి స్థానికులు అతి కష్టం మీద దానిని విడిపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
మరో వీడియో
ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి కోతి ఆపిల్ పండును చాలా తెలివిగా దొంగతనం చేసి పారిపోయే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఓ వ్యక్తి తన వీపుకు బ్యాగును తగిలించుకుని ఉన్నాడు. అందులో కొన్ని ఆపిల్ పండ్లు ఉన్నాయి. పార్కులో కూర్చుని పరిసరాల అందాలను చూస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ కోతి ఆ బ్యాగ్ దగ్గరికి వస్తుంది. బ్యాగులో తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానంతో ముందుగా బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏమీ ఉండవు. అక్కడితో ఆగిపోకుండా.. మరో జిప్ ను ఓపెన్ చేస్తుంది. అందులో యాపిల్స్ కనిపిస్తాయి. కోతికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. వెంటనే చేతిని లోపలికి పెట్టి ఓ ఆపిల్ పండును తీసుకుంటుంది. సైలెంటుగా అక్కడి నుంచి పరుగులు తీస్తూ పారిపోతుంది.
View this post on Instagram
Also Read: CJI DY Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)