ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్
Modi US Visit: ప్రధాని మోదీకి బైడెన్ ఓ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
PM Modi US Visit:
టీషర్ట్ గిఫ్ట్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగిసిన సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ T Shirtని మోదీకి అందజేశారు. హిస్టారికల్ ట్రిప్ అంటూ కితాబునిచ్చారు. ఆ టీషర్ట్‌పై AI అని రాసుంది. The Future is AI. America-India" అని ప్రింట్ చేసుంది. దీన్ని తీసుకున్న ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు బైడెన్. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే మోదీకి టీషర్ట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
"గత ఏడేళ్లలో భారత్ అమెరికా మధ్య మైత్రి బలపడింది. ద్వైపాక్షిక బంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక టెక్నాలజీ పరంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విస్తృతమవుతోంది. ఇదే సమయంలో మరో AI కూడా బలపడుతోంది. అదే అమెరికా-ఇండియా బంధం"
- ప్రధాని మోదీ
AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo
— Narendra Modi (@narendramodi) June 23, 2023
#WATCH | US President Joe Biden gifted a special T-Shirt to PM Narendra Modi with the PM's quote on AI.
— ANI (@ANI) June 23, 2023
"In the past few years, there have been many advances in AI- Artificial Intelligence. At the same time, there has been even more momentous development in another AI-… pic.twitter.com/rx97EHZnMj
NRIలను ఉద్దేశిస్తూ స్పీచ్..
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. తన మూడు రోజుల పర్యటనలో లభించిన ప్రేమాభిమానాలకు మీరే కారణం అంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను మోదీ వివరించారు. భారత్ అమెరికా మధ్య స్నేహ బంధంలో కొత్త ప్రయాణం మొదలైందన్నారు. రోనాల్డ్ రీగన్ సెంటర్‌కు వచ్చిన భారతీయులంతా ఆ ప్రాంతాన్ని మినీ భారత్‌లా మార్చేశారని ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అందమైన చిత్రాన్ని చూపించిన వారికి ధన్యావాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లడంలో ఆయనదే కీలక పాత్ర అన్నారు. రక్షణ ఒప్పందాలు భారత్, అమెరికా సుస్థిరం చేశాయన్నారు. మోదీ. మేం ఒప్పందాలు, అగ్రిమెంట్స్ మాత్రమే చేసుకోవడం లేదు. జీవితాలను, కలలను, లక్ష్యాలను మార్చబోతున్నామని వివరించారు.