అన్వేషించండి

Mana Mitra WhatsApp Governance In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Mana Mitra WhatsApp Governance In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన మన మిత్ర వాట్సాప్‌కు మంచి మైలేజ్ వస్తోంది. ఇందులో క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ చూడండి.

Mana Mitra WhatsApp Governance In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. 150కిపైగా సేవలు ఇక్కడ నుంచి ప్రజలు పొందవచ్చని పేర్కొంది. బస్ టికెట్లు మొదలు కొని క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికేట్, దేవాలయాల దర్శనాలు ఇలా 161 సేవలు లభిస్తాయి. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచి ఒక్క క్లిక్‌తో చాలా సేవలు లభించనున్నాయి. ఈ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా పొందాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలనుకునే వాళ్లు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఓ ఏడాదిలో ఒకసారైనా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్లు మాత్రమే ఈ వాట్సాప్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోగలరు. అలా తీసుకోని వాళ్లు మాత్రం ఒకసారి నేరుగా వెళ్లి క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పొందగలుగుతారు. 

మీరు 9552300009 నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌కు మెసేజ్‌ పంపించాల్సి ఉంటుంది. హాయ్‌ అని పంపించాలి. సర్వర్‌ బిజీని బట్టి మీకు రిప్లై వస్తుంది. సర్వర్ బిజీగా ఉంటే లేట్‌గా రిప్లై వస్తుంది. లేకుంటే త్వరగా రిప్లై వస్తుంది. రిప్లై వచ్చిన తర్వాత సేవలను అన్వేషించండి అని వస్తుంది. 

ఆ సేవలను అన్వేషించండి బటన్‌పై క్లిక్ చేస్తే మెయిన్ మెనూలోకి వెళ్తారు. అక్కడ మీరు ఏ కేటగిరిలో సేవలు కావాలనుకుంటున్నారో ఆ విభాగం పై క్లిక్ చేయాలి. మీకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ కాబట్టి రెవెన్యూ విభాగంపై క్లిక్ చేయాలి. రెవెన్యూ విభాగంపై క్లిక్ చేస్తే అందులో లభించే సేవల జాబితా మీకు కనిపిస్తుంది. అందులో 13 రకాల సేవలు ఉంటాయి. 

ఆ సేవల విభాగంలో మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ప్రత్యేకంగా ఏం కాలమ్ కనిపించదు. కానీ ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్ జారీ అనే విభాగం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్ జారీ విభాగంపై క్లిక్ చేస్తే ఆధార్ కార్డు ఎంట్రీ చేసేందుకు కాలమ్‌ కనిపిస్తుంది. మీ ఆధార్ కార్డు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంట్రీ చేసిన ఆధార్ కార్డు మీదా కాదా అని చెక్ చేసేందుకు ఓటీపీ కూడా వస్తుంది. అలా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి. 

ఒకసారి ఆధార్‌ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీ తండ్రి, భర్త పేరు, మతం, విద్యార్హతలు, వైవాహిక స్థితి, మెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడీ అనేది ఆప్షనల్‌. ఉంటే ఇవ్వొచ్చు లేకుంటే లేదు. ఈ వివరాలు నిర్దారించుకోమని అడుగుతుంది. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలతో మ్యాచ్ అయితే మీరు తర్వాత దశకు తీసుకెళ్తుంది. 

ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో మీ వివరాలు మ్యాచ్ కాకుంటే మాత్రం అక్కడితో సేవలు ముగిసిపోతాయి. అంటే మీరు నేరుగా వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలని సూచిస్తుంది. 

ఒకసారి వివరాలు పూర్తిగా ఇచ్చిన తర్వాత సమర్పించండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్‌ ద్వారా వాళ్లకు మెసేజ్ వెళ్తుంది. కాసేపు ఆగిన తర్వాత అక్కడి నుంచి రిప్లై వస్తుంది. అందులో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ వివరాలతో ఓ పేజీ వస్తుంది. అందులో ప్రస్తుతం మీరు ఉన్న అడ్రెస్‌, పర్మినెంట్ అడ్రెస్ ఒకటై ఉంటే అక్కడ ఉండే ఓ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. లేదంటే ప్రజెంట్ అడ్రెస్‌ కింద క్లిక్ చేసి అడ్రెస్ రాయాల్సి ఉంటుంది. 

ఇన్ని వివరాలు ఇచ్చిన తర్వాత కొనసాగించండీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఓ నెంబర్ కేటాయిస్తున్నట్లు వస్తుంది. గతంలో మీకు సర్టిఫికెట్ వచ్చి ఉంటే దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత శాశ్వత చిరునామా లేకుంటే తాత్కాలిక చిరునామా అని అడుగుతుంది. అందులో ఏది కావాలంటే దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ ఊరి పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. 

అక్కడ ముందుగా మీరు ఊరి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు రెండోసారి ఎందుకు అప్లై చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. దీనికి రిలేటెడ్‌గా నాలుగు ఆప్షన్స్‌ ఉంటాయి. స్కూల్, కాలేజీలో అడ్మిషన్ కోసమా లేదా. ఉపాధి కోసమా, ఏవైనా స్కీమ్స్‌ కోసమా, రుణాల కోసమా, లేదా పేరు దిద్దుబాటు కోసమా అని చెప్పాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ముందుకెళ్లండి అనే ఆప్షన్‌పై నొక్కితే అప్లికెంట్ పూర్తి వివరాలు వస్తాయి. 

Also Read: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?

అప్లై చేసిన వ్యక్తి ఎవరు, వయసు, తండ్రి పేరు, ఊరు, ఎప్పుడు అప్లై చేశారు. ఎప్పుడు అప్రూవ్ అయింది. ఇలా అన్ని వివరాలు వస్తాయి. ఆ తర్వాత చివరిగా ఉన్న రెండు ఆప్షన్స్‌పై క్లిక్ చేసి సమర్పించండి అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. వెంటనే రెవెన్యూ అధికారులకు మీ రిక్వెస్ట్ వెళ్తుంది. 

ఇంతలో మీకు గతంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్‌, ఆధార్ కార్డును స్కాన్ చేసి పీడీఎఫ్‌ రెడీ చేసుకోవాలి. ఇది 1 ఎంబీ లోపు సైజు ఉండాలి. ఆ వివరాలు పంపాలని మెసేజ్ వచ్చిన వెంటనే ఈ రెండూ ఒకే ఫైల్‌లో వాట్సాప్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. 

ఆ వివరాలు కరెక్ట్ అయితే 40 రూపాయలు చెల్లించాలని చూపిస్తుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ మరోసారి జారీ చేస్తున్నందుకు ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులను కూడా అక్కడే చెల్లించవచ్చు. చెల్లించు అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. 

పేమెంట్‌ విజయవంతమైనట్టు కూడా మెసేజ్ వస్తుంది. వచ్చిన వెంటనే సర్టిఫికెట్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకోవచ్చు. అందులో ఉండే క్యూఆర్‌ కోడ్ ద్వారా కూడా మీరు వాడుకోవచ్చు. 
క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తోపాటు రెసిడెన్స్, పుట్టిన తేదీ రిలేటెడ్‌ వివరాలు కూడా ఉంటాయి. అందుకే మూడు విషయాలు ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి కాబట్టి దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అంటారు. ఇదే క్యాస్ట్ సర్టిఫికేట్‌గా కూడా చెల్లుబాటు అవుతుంది.

Also Read: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget