WhatsApp Governance: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
Andhra Pradesh: వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మన మిత్ర తీరు ఎలా ఉంది? తిరుమల టిక్కెట్లు కూడా బుక్ చేసుకోవచ్చా ?

Manamitra WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఇలా లోకేష్ నెంబర్ ప్రకటించగానే అలా లక్షల మంది ప్రయత్నించారు. ఈ కారణంగా కొంత మందికి సర్వీసులు ఆలస్యమయ్యాయి కానీ ఈ సేవలు మాత్రం పరిపాలనలో ప్రజలకు సరికొత్త సేవలను అందించనున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉండే సర్టిఫికెట్లను తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది. ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికి అయితే పరిమితమైన సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రతి దానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని మన మిత్ర
గతంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చింది. సర్టిఫికెట్లు ఇచ్చేందుకే ఇందులో కొంత మంది ఉద్యోగుల్ని నియమించారు. అయితే ఇప్పుడు ఆ సేవలు ఫోన్ లోనే అందిస్తున్నారు. అయితే ఊరకనే వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా టెస్టులు చేసి డౌన్ లోడ్లు చేసుకోవడం వల్ల ఈ ప్రయత్నానికే సమస్యలు వస్తాయి. ఇలాంటి సర్వీసు ప్రారంభించినప్పుడు అందరూ ఆతృతగా ప్రయత్నం చేస్తారు. నిజంగా అవసరం అయి ప్రయత్నించేవారికి ఈ కారణంగా సమస్యలు ఎదురవుతాయి. టెస్టింగ్ చేయడానికి ఉన్న పళంగా పని తీరు చూడాల్సిన అవసరం లేదు.
తిరుమల టిక్కెట్లు ప్రస్తుతానికి బుకింగ్ లేదు !
ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి దేవాలాయాల టిక్కెట్లు బుక్ చేసుకోవడం వరకూ అన్నీ ఉన్నాయి. దీంతో అందరికీ తిరుమల టిక్కెట్లు కూడా బుక్ చేసుకోవచ్చా అన్న సందేహం వచ్చింది.అయితే ప్రస్తుతానికి శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను మాత్రమే చూపిస్తోంది. తిరుమల టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మూడు నెలల ముందుగానే మూడు వందల రూపాయల టిక్కెట్లు రిలీజ్ చేస్తారు. అయితే అలా రిలీజ్ చేసినవి కూడా వాట్సాప్ లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉండాలని కొంత మంది అనుకుంటున్నారు. త్వరలో ఈ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
సర్వీసుల్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తే ప్రజాదరణ
ప్రభుత్వం ఈ సర్వీసును ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుతూ వెళ్తే.. ప్రభుత్వం ప్రజలకు చేసే సేవల్లో ఇదే గొప్పది అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు తగ్గిపోతారు. ప్రజలకు బోలెడంత సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ప్రజలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే.. ప్రభుత్వం తాము ఎంపిక చేసుకున్న స్ఫూర్తిని కొనసాగిస్తే.. ఇదో మంచి ప్రయత్నంగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు. వాట్సాప్ సర్వీసులు ఇప్పుడు ప్రజంలదరి జీవితాల్లో భాగం అవుతున్నాయి.
Also Read : ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, చిత్తశుద్ధితో పని చేయాలి - ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో టెలీకాన్ఫరెన్సులో చంద్రబాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

