Rahul Telangana tour cancel : రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
Rahul Gandhi: రాహుల్ వస్తారని ఎవరికీ తెలియదు కానీ టూర్ క్యాన్సిల్ అని మాత్రం ప్రకటించారు. దీంతో ఆశ్చర్యపోవడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల వంతు అయింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది అని మంగళవారం మధ్యాహ్నం ఓ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు రాహుల్ గాందీ ఎప్పుడు తెలంగాణకు వస్తున్నారని ప్రకటించారు.. ఆయన వస్తున్నారంటే ఎంత హడావుడి ఉండాలి.. ఎవరికీ తెలియకుండా ఎప్పుడు ఆయన టూర్ ఖరారైందని ఆశ్చర్యపోయారు.
హఠాత్తుగా రాహుల్ గాందీ టూర్ క్యానిలని ప్రకటన
కానీ అసలుకు రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన ఖరారు అయింది. అది ఎందుకో.. ఎజెండా ఏమిటో ఎవరికీ తెలియదు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసో లేదో స్పష్టత లేదు. ఆయన డైలీ షెడ్యూల్ వరంగల్ టూర్ లేదు. అందుకే రాహుల్ గాంధీ వరంగల్ టూర్ నుంచి ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా రాహుల్ గాంధీ ఎక్కడికి వస్తారబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలనుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అ ప్రైవేటు కార్యక్రమం ఏమిటో స్పష్టత లేదు.
వరంగల్ లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వస్తారని అనధికారికంగా సమాచారం
అయితే పార్లమెంట్ లో చర్చల కారణంగా .. కీలకమైన బిల్లులపై మాట్లాడాల్సిన అవసరం పడుతున్నందున ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. అసలు టూర్ గురించే ఎవరికీ అధికారికంగా చెప్పనప్పుడు పర్యటన రద్దు అనే సమాచారం మాత్రం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నది మరో డౌట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్ఫ్యూజన్ కు .. రాహుల్ గాంధీ పార్టీ వర్గాలతో ఉన్న దూరాన్ని నిరూపించేలా ఈ వ్యవహారం ఉందన్న అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
పార్లెమంట్ చర్చల కారణంగా చివరి క్షణంలో రద్దు - రేవంత్‌కూ సమాచారం లేదా ?
రేవంత్ రెడ్డి .. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితలని చెబుతారు. ఆయన సీఎంగా ఉన్న రాష్ట్రానికి రాహుల్ ప్రైవేటు కార్యక్రమానికి వస్తున్నా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డిని.. రాహుల్ గాంధీ నేరుగా కలవలేదు. ఈ కారణంగా వారిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమ మధ్య గ్యాప్ ఏమీ లేదని.. తానే రాహుల్ అపాయింట్ మెంట్ అడగలేదని రేవంత్ చెబుతున్నారు. నిజం ఏమిటో కానీ అసలు రాహుల్ వస్తారని తెలియని పర్యటనను రద్దు అయిందని ప్రకటించడం మాత్రం హాస్యాస్పదంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

