అన్వేషించండి
Morning News Headlines: శ్రీకాకుళానికి మరో తుపాను, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పై ఆరోపణలు వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
![Morning News Headlines: శ్రీకాకుళానికి మరో తుపాను, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పై ఆరోపణలు వంటి మార్నింగ్ న్యూస్ Todays Top 10 headlines 23th October Andhra Pradesh Telangana politics latest news today from abp desam latest telugu news updates Morning News Headlines: శ్రీకాకుళానికి మరో తుపాను, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పై ఆరోపణలు వంటి మార్నింగ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/23/83456267a84bb24563b1366f596add3a17296487774461036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Todays Top 10 headlines
Source : Canva
కృష్ణా నది తీరాన అబ్బురపరిచిన డ్రోన్ షో
అమరావతిలో కృష్ణా నది తీరాన ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శన... వీక్షకులను మంత్రముగ్దులను చేసింది. డ్రోన్ షోతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు. లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శనను తిలకించేందుకు కృష్ణా తీరానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా తీరమంతా సందర్శకులతో నిండిపోయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఇక వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు
సగానికిపైగా ప్రభత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా పొందే ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ఇందుకోసం.. మెటాతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం చేసుకుంది. కులం సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇక వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది. ప్రభుత్వానికి వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు సహా ఛార్జీలను ఇక వాట్సాప్‌లోనే చెల్లించే అవకాశం రానుంది. ధ్రువపత్రాల సమస్యను పరిష్కరిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన లోకేశ్.. ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్ర ఎన్నికల నేపధ్యంలో పెరిగిన నిఘా
మహారాష్ట్ర ఎన్నికల నేపధ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అక్టోబర్22న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 29 వరకు అభ్యర్థులు నామినేషన్ వేయవచ్చు. నవంబర్ 20న ఎన్నికలు ఒకే దశలో నిర్వహించి, నవంబర్ 23న ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ఫలితాలు ప్రకటించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జేఎల్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజన్ లిస్టును TGPSC అధికారిక వెబ్‌సైట్ https: //www. tspsc. gov. in/లో వెల్లడించింది. మొత్తం 1,392 జేఎల్ పోస్టులకు ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. కాగా, TGPSC 2022లో జేఎల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, 2023లో పరీక్షలను నిర్వహించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పోలీస్ కుటుంబాల రాస్తారోకో
పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖిలా వరంగల్ మండలం గవిచర్ల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం పోలిస్ కుటుంబాలు రాస్తారోకో చేశారు. 8 గంటలకు మించి పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫోర్త్ బెటాలియన్ కుటుంబీకులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గించాలని, కొత్త డీజీ రావడంతో సమస్య తలెత్తిందని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విమానం దారి మళ్లింపు.. ఎందుకంటే..?
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. గోవా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. గాల్లో కాసేపు చక్కర్లు కొట్టిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దాంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆపై ల్యాండింగ్ అనుమతి రావడంతో ఇండిగో విమానం గన్నవరం నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ముత్యాలమ్మ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్తీ ప్రజలతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
శ్రీకాకుళం జిల్లా వాసుల గుండెల్లో గుబులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేటి నుంచి తుఫాన్‌గా బలపడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
‘దానా’ తుఫాన్ ప్రభావంతో ఈనెల 23, 24, 25 తేదీలలో ఈస్ట్-కోస్ట్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 23వ తేదీన 18 రైళ్లు, 24వ తేదీన 37 రైళ్లు, 25వ తేదీన 11 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. క్యాన్సిలైన రైళ్లలో.. కన్యాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్, సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం!
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పలాసలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. పుట్టిన రోజు వేడుకలకు పిలిచి మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అత్యాచార ఘటనను మరో యువకుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. నిందితులను కఠిన శిక్షించాలని పోలీసులను కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రాజమండ్రి
విజయవాడ
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion