అన్వేషించండి

Indian Railways: సీనియర్ సిటిజన్స్‌కు ఇండియన్ రైల్వే కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మీకు తెలుసా! 45 ఏళ్ల నుంచే మహిళలకు

Senior Citizens: భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్ళు నిండిన మహిళల కోసం బెర్తుల రిజర్వేషన్లలో మూడు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే చాలా మందికి వాటి గురించి తెలియదు.

Facilities to Senior citizens in Train: దేశంలో అతి పెద్దరవాణా వ్యవస్థ అయిన రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రైల్వే ప్లాట్‌ఫాం మీద పోర్టర్ నుంచి రిజర్వేషన్‌లో లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్‌లు వరకు ఎన్నో ఉన్నాయి. మగవాళ్లకైతే 60 ఏళ్లు నిండితే వర్తించే వెసులుబాట్లు కొన్ని మహిళలకు 45 ఏళ్లకే వర్తిస్తాయి.

సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణంలో మూడు మంచి ఫెసిలిటీలు:

            ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్‌పోర్టు వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. రోజూ లక్షలాది రైళ్లలో కోట్లాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రవాణా వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అందులో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి. రైలు టికెట్‌ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు ఈ ఫెసిలిటీస్‌ను సీనియర్ సిటిజన్ల కోసం ఇండియన్ రైల్వే అందిస్తోంది. వీటిని వయసు మళ్లిన వాళ్లు చాలా సులభంగా పొందచ్చు. అయితే చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు నిండిన మగవాళ్లను, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను రైల్వే తీసుకుంటుంది.

మూవింగ్ ట్రైన్‌లో లోయర్‌ బెర్తుపై తొలి హక్కు సీనియర్ సిటిజన్లదే:

            దేశంలో దాదాపు చాలా రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లు ఉంటాయి. వాటిల్లో మూడు రకాల బెర్త్‌లు ఉంటాయి. లోయర్‌, మిడిల్‌, అప్పర్ బెర్తులు ఉంటాయి. రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తును ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ప్రయారిటీ బేసిస్‌లో సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్తును కేటాయిస్తారు. అదే మహిళల విషయంలో ఐతే 45 ఏళ్లు నిండిన వాళ్లకు లోయర్‌ బెర్తు పొందే అవకాశం ఉంది.

            అదే మూవింగ్ ట్రైన్‌లో అయితే ఖాళీ అయ్యే లోయర్‌ బెర్తుపై తొలి హక్కు సీనియర్‌ సిటిజన్లకే ఉంటుంది. ఒక వేళ రిజర్వేషన్ సమయంలో లోయర్ బెర్తు లేకుంటే ప్రయాణ సమయంలో ఏ స్జేజ్‌లో అయినా రైలులో లోయర్‌ బెర్తు ఖాళీ అయితే అది సీనియర్ సిటజన్లకే ముందుగా కేటాయించాలి. TTE అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి సదరు సీనియర్ సిటిజన్‌కు కేటాయిస్తారు. ఒక వేళ రైలు ప్రారంభమయ్యేటప్పటికే లోయర్ బెర్తు ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్‌ మిడిల్ బెర్తుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు ఆ బెర్తు పొందేలా ఇండియన్ రైల్వే రూల్స్ ఉపయుక్తంగా ఉన్నాయి.

సీనియర్ సిటిజన్లకు స్లీపర్‌, ఏసీ కోచ్‌లలో ఐఆర్‌సీటీసీ సీనియర్ కోటా కింద ప్రత్యేక బెర్తులు:

ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి టైన్‌లోని రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో కొన్ని బెర్తులు సీనియర్ సిటిజన్స్‌ కోసం రిజర్వ్‌డ్‌ చేసి ఉంటాయి. స్లీపర్ కోచ్లలో ఐతే ఆరు బెర్తులు, ఏసీ 3 టైర్‌, ఏసీ టూ టైర్‌లో మూడేసి బెర్త్‌లను రిజర్వ్ చేసి ఉంచుతారు. అయితే అవసరాన్ని బట్టి ఈ సీట్లను 45 ఏళ్లు నిండిన మహిళలకు, గర్భిణులకు కేటాయిస్తుంటారు. ఇదే సమయంలో ఏసీ కోచ్‌లు ఉన్నమ రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలోనూ సీనియర్ సిటిజన్స్‌కు సాదారణ రైళ్లలో కంటే ఎక్కువ బెర్తులు రిజర్వ్‌ అయి ఉంటాయి.

లోకల్‌ ట్రైన్స్‌, మెట్రో రైళ్లలోనూ సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్ :

లోకల్‌ రైళ్లు మెట్రో ట్రైన్‌లలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి మెట్రో నగరాల్లో సిటిజన్లుయి ఈ ఫెసిలిటీస్ పొందొచ్చు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రెన్‌ రైల్వేల కింద నడిచే లోకల్‌ రైళ్లలో ఈ రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది. వీటితో పాటు మేజర్ రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్‌, పోర్టర్స్ సౌకర్యం కూడా రైల్వే కలిపిస్తోంది. అయితే ఈ సదుపాయాలకు నిర్ణీత మొత్తంలో చెల్లించి ఈ సదుపాయాలు పొందాల్సి ఉంటుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
Harish Rao: 'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
Xiaomi Mix Flip: మొదటి ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - అంత రేటు ఎందుకు బ్రో!
మొదటి ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - అంత రేటు ఎందుకు బ్రో!
Tirumala Laddu Row: అటు సీఎం చంద్రబాబు ట్వీట్‌- ఇటు జగన్ పర్యటన రద్దు- మధ్యలో ఏం జరిగింది?
అటు సీఎం చంద్రబాబు ట్వీట్‌- ఇటు జగన్ పర్యటన రద్దు- మధ్యలో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
Harish Rao: 'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
Xiaomi Mix Flip: మొదటి ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - అంత రేటు ఎందుకు బ్రో!
మొదటి ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - అంత రేటు ఎందుకు బ్రో!
Tirumala Laddu Row: అటు సీఎం చంద్రబాబు ట్వీట్‌- ఇటు జగన్ పర్యటన రద్దు- మధ్యలో ఏం జరిగింది?
అటు సీఎం చంద్రబాబు ట్వీట్‌- ఇటు జగన్ పర్యటన రద్దు- మధ్యలో ఏం జరిగింది?
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Jagan Tirumala Tour Cancel : తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ -  వివాదాస్పదం కాకూడదనేనా ?
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ - వివాదాస్పదం కాకూడదనేనా ?
Declaration Boards :  అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే - తిరుపతిలో పలు చోట్ల బోర్డుల దృశ్యాలు వైరల్
అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే - తిరుపతిలో పలు చోట్ల బోర్డుల దృశ్యాలు వైరల్
Devara Movie: జపాన్ నుంచి అమెరికా వచ్చిన ఫ్యాన్స్ - ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!
జపాన్ నుంచి అమెరికా వచ్చిన ఫ్యాన్స్ - ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!
Embed widget