సనాతన ధర్మ వివాదంలో ఉదయనిధి స్టాలిన్‌కి సుప్రీంకోర్టు నోటీసులు, వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Sanatana Dharma: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.
Sanatana Dharma Remark:
14 మందికి నోటీసులు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మొత్తం 14 మందికి నోటీసులిచ్చింది. వీరిలో డీఎమ్‌కే ఎంపీ ఏ. రాజా కూడా ఉన్నారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌పై FIR నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన సుప్రీంకోర్టు ఆ మేరకు నోటీసులు అందించింది. తమిళనాడు పోలీసులు, CBI,తమిళనాడు ప్రభుత్వానికి కూడా నోటీసులు అందాయి. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే...ఈ వ్యాఖ్యల్ని విద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు.
Supreme Court issues notice to the Tamil Nadu government and DMK leader Udhayanidhi Stalin for his remarks on 'Sanatan Dharma'
— ANI (@ANI) September 22, 2023
(file pic) pic.twitter.com/8HeBATdwwx
ఈ నోటీసులపై DMK నేత టీకేఎస్ ఎలంగోవన్ స్పందించారు. కొంత మంది ఈ వ్యాఖ్యల్లో క్లారిఫికేషన్ కావాలని పిటిషన్ వేశారని, తాము కూడా సనాతన ధర్మం అంటే ఏంటో వివరణ అడుగుతామని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము స్పందిస్తామని వెల్లడించారు.
"సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కావాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది. మేం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సనాతన ధర్మం అంటే ఏంటో అడుగుతాం. ఈ సివిలైజ్డ్ సొసైటీలో ఇంకా ఆ ధర్మం అవసరమేంటో ప్రశ్నిస్తాం. వాళ్లు ఏదో వివరణ ఇస్తారు కదా. ఆ తరవాతే మేం కోర్టుకి సమాధానం చెబుతాం"
- ఎలంగోవన్, డీఎమ్‌కే నేత
#WATCH | On Supreme Court issuing notice to Tamil Nadu government and DMK leader Udhayanidhi Stalin for his remarks on 'Sanatan Dharma', DMK leader TKS Elangovan says, "There was a petition filed and they are seeking the clarification. Let the clarification go... The matter is… https://t.co/Is7imXLILS pic.twitter.com/nbMbYWwUTi
— ANI (@ANI) September 22, 2023
సనాతన ధర్మం వివాదంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం తల్లిదండ్రుల్ని, గురువులను గౌరవించమని చెప్పిందని, పేదలను సంరక్షించాలని ఉపదేశించిందని వెల్లడించింది. సనాతనం అంటే కేవలం కుల వ్యవస్థ, అంటరానితనం అని మాత్రమే అభిప్రాపడడం సరికాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపైనా అసహనం వ్యక్తం చేసింది. అంటరానితనం ఎక్కడ ఉన్నా దాన్ని కచ్చితంగా చెరిపేయాలని, అలాంటి వాటిని సహించకూడదని తేల్చి చెప్పింది. అది సనాతన ధర్మం పేరిట చేస్తే మరింత ఖండించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కే అయినప్పటికీ...ఇది విద్వేషాలు పెంచేదిగా ఉండకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మతం గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరి ప్రసంగం అయినా సరే...ఎవరి మనోభావాలనూ దెబ్బ తీసే విధంగా ఉండకూడదని చెప్పింది.
Also Read: బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?