News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

Sikhs Population in Canada: బ్రిటీష్ కాలం నుంచే సిక్కులు కెనడాకి వలస వెళ్లడం మొదలైనట్టు చరిత్ర చెబుతోంది.

FOLLOW US: 
Share:

Sikhs Population in Canada: 

1897లో తొలిసారి..

కెనడాకి సిక్కులు ఆ స్థాయిలో ఎందుకు వలస వెళ్లారు..? అక్కడే ఎందుకు స్థిరపడిపోయారు..? అక్కడే ఉండిపోయేంతగా అవకాశాలు ఏం కనిపించాయి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే...18వ శతాబ్దంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాలి. అప్పట్లో British India Armyలో కేసర్ సింగ్ (Kesur Singh) రిసాల్దార్‌ మేజర్‌గా పని చేశారు. 1897లో ఆయన తొలిసారి కెనడాకి వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. కెనడాలో స్థిరపడిన తొలి సిక్కు ఇతనే అని చరిత్ర చెబుతోంది. క్వీన్ విక్టోరియా డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో డ్యూటీ చేసిన ఆయన కెనడాని చూసి మురిసిపోయారు. అక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించారు. వెంటనే ఇండియాలోని తమ వాళ్లకు ఈ సమాచారం అందించారు. ఈ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సిక్కులు క్రమంగా కెనడాకి వెళ్లడం మొదలు పెట్టారు. రిటైర్ అయిన సైనికులు, యువకులు పెద్ద ఎత్తున వలస వచ్చారు. అక్కడే రైల్వే, వ్యవసాయ రంగాల్లో పనుల్లో చేరారు. అది మొదలు చాలా మంది పొట్ట చేత పట్టుకుని కెనడాకి తరలి వచ్చారు. 1908 నాటికి కెనడాలో సిక్కుల సంఖ్య 2 వేలకు పెరిగింది. ఆ తరవాత మహిళలు, చిన్నారులూ కెనడాకి వెళ్లారు. క్రమంగా అక్కడే స్థిరపడ్డారు. అలా వాళ్ల జనాభా పెరుగుతూ వచ్చింది. కెనడా ఆర్మీలో సిక్కు యువకులు చేరారు. యుద్ధ రంగంలో పోరాడారు. కానీ...దశాబ్దాల పాటు అక్కడ వలసవాదుల్లానే ఉండిపోయారు. 1947లో భారత్‌కి స్వాతంత్య్రం వచ్చాక కెనడాలో ఉన్న సిక్కులకు అక్కడి పౌరసత్వం లభించింది. ఓటు వేసే హక్కూ వచ్చింది. తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కెనడా కూడా ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు చేసింది. సిక్కులు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా ప్రోత్సహించింది. అలా వాళ్ల జనాభా పెరిగింది. 

ప్రత్యేక గుర్తింపు కోసం..

1947లో బ్రిటీష్‌ వాళ్లు ఇండియా విడిచి పెట్టి వెళ్లారు. భారత్‌ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ సమయంలో లక్షలాది మంది ముస్లింలు అప్పుడే కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్‌కి వలస వెళ్లారు. హిందువులు, సిక్కులు మాత్రం భారత్‌లోనే ఉండిపోయారు. కానీ...భారత్ హిందూ మెజార్టీ దేశంగానే స్థిరపడిపోయింది. అప్పుడే సిక్కుల్లో భయం మొదలైంది. హిందువుల మెజార్టీ ఉన్న ఈ దేశంలో ఉంటే తమ ఉనికికి ప్రమాదం తప్పదేమో అని ఆందోళన చెందారు. అందుకే...తమకూ ప్రత్యేకంగా ఓ సొంత రాష్ట్రం ఉంటే బాగుంటుందని అనుకున్నారు. హిందువులకు ఉన్నంత ప్రాధాన్యత తమకు ఉండదని భావించారు. తమని తామే సెకండ్ క్లాస్ సిటిజన్స్‌గా పరిగణించారు. 1980ల్లో ఈ ఆలోచన బాగా బలపడిపోయింది. 1991 నుంచి చూస్తే కెనడాకి వలస వెళ్లిన సిక్కుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021 జనాభా లెక్కలు అధికారికంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కెనడాలో తమ కమ్యూనిటీ పెరుగుతుండడం వల్ల చాలా మంది సిక్కు యువతీ యువకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. 

1991 నుంచి పెరిగిన వలసలు..

ప్రస్తుతం అక్కడ 7 లక్షల 70 వేల మంది సిక్కులున్నారు. వీరిలో 2 లక్షల 36 వేల మంది కెనడాలో పుట్టి పెరిగిన వాళ్లే. 4 లక్షల మందికి పైగా అక్కడ స్థిర నివాసం ఉంది. 1980కి ముందు కెనడాలో  33,535 మంది సిక్కులున్నారు. 1980-90 మధ్య కాలంలో ఈ సంఖ్య  40,440కి చేరుకుంది. అయితే...1991 తరవాతే ఈ సంఖ్య భారీగా పెరిగింది. 1991-2000 మధ్య కాలంలో 88 వేల 210 మంది సిక్కులు కెనడాలో శాశ్వత పౌరసత్వం సాధించారు. 2001-10 మధ్య కాలంలో లక్షా 11 వేల మంది శాశ్వత పౌరసత్వం సాధించగా...2011-2021 మధ్య కాలంలో లక్షా 41 వేల మందికి పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్‌ వచ్చింది. కెనడా కూడా సిక్కులకు శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. కొవిడ్ సంక్షోభానికి ముందు ఏటా 3 లక్షల మందికి పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఇస్తూ వచ్చింది. ఏటా కెనడాకి వస్తున్న విదేశీయుల్లో 4% మంది సిక్కులే ఉంటున్నారు. అంటే...వీళ్ల కమ్యూనిటీ ఇక్కడ ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. 

Also Read: సిక్కుల ఓటు బ్యాంక్‌ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

Published at : 22 Sep 2023 01:42 PM (IST) Tags: India Canada Tensions Sikhs Population Canada Sikhs Population Sikhs Imigration Canada Sikhs

ఇవి కూడా చూడండి

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే