Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Maha Kumbh Mela 2025 Travel Tips : ప్రయాగలో జరుగుతున్న మహా కుంభ మేళాకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి మీ జర్నీని సులభం చేయడంలో హెల్ప్ చేస్తాయట.
Maha Kumbh Mela 2025 Prayagraj Travel Tips : మహా కుంభ మేళా 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మీరు కూడా ప్రయాగ వెళ్లి.. అక్కడ పవిత్ర స్నానం చేయాలనుకుంటున్నారా అయితే మీరు ప్రయాగ వెళ్లేముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది మీకు ఆధ్యాత్మిక జ్ఞాపకాలు అందించడంతో పాటు.. సేఫ్ జర్నీని ఇది ప్రమోట్ చేస్తుంది. ఇంతకీ మహా కుంభ మేళాకు వెళ్లాలనుకునేవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాల్లో మహా కుంభ మేళా ఒకటి. ఎలాంటి ఆహ్వానం లేకుండా భక్తులంతా ఒకే ప్రదేశానికి చేరుకుని.. అక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమావేశాల్లో ఇది ఒకటి. అలాంటి మహా కుంభ మేళా 2025 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. గంగా, యమునా, పౌరణాక సరస్వతీ నదుల సంగం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉత్సవానికి హాజరవుతారు. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి, జర్నీకి మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగానే బుక్ చేసుకోవాలి..
మీరు కుంభ మేళాకు వెళ్లాలనుకుంటే.. జర్నీకోసం, స్టేయింగ్ కోసం ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది. ఎలా వెళ్లాలి? వెళ్లిన తర్వాత ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి వంటివి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. లేదా ట్రావెల్ ఏజెన్సీల సహాయం తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న ఈవెంట్స్‌కు తగ్గట్లుగా మీ జర్నీని ప్లాన్ చేసుకోవాలి.
ప్యాకింగ్..
కావాల్సిన, అవసరమైన వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. ఎక్కువదూరం నడవాల్సి వస్తుంది కాబట్టి.. కంఫర్ట్‌బుల్‌గా ఉండే ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. ఉష్ణోగ్రతలను బట్టి డ్రెస్సింగ్ ఉండాలి. అలాగే మెడిసన్స్ వాడుతూ ఉంటే.. వాటిని కూడా తీసుకువెళ్లాలి.
ఆరోగ్యానికై..
లక్షల్లో జనసందోహం ఉన్నప్పుడు వైరస్లు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో కలరా ఇలాంటి ఫలితాన్నే ఇచ్చింది. కాబట్టి.. మాస్క్, శానిటైజర్ కచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. శుభ్రత పాటించిన ప్రాంతాల్లో ఫుడ్ తినాలి. లేదా.. హెల్తీ ఫుడ్స్, ఫ్రూట్స్‌ని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లొచ్చు.
మినిమల్గా..
జన సందోహం మధ్యలోకి వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు తీసుకెళ్లకపోవడమే మంచిది. అలాగే ఎక్కువ లగేజ్ లేకుండా చూసుకోండి. మొబైలన్ ఫోన్, డబ్బులు, గుర్తింపు కార్డులు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. కలిసి వెళ్తే.. తప్పిపోకుండా ఒకరి లోకేషన్ మరొకరు షేర్ చేసుకోండి.
జనాలు ఎక్కువగా ఉంటే..
క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రూప్‌తో కలిసి వెళ్తే.. అందరూ ఒకటే చోట ఉండడం లేదా.. ఒక ప్లేస్ దగ్గర మీట్ అవ్వడం వంటి పాయింట్స్ పెట్టుకోవాలి. వాలంటీర్లు, అధికారులు ఇచ్చే సూచనలు ఫాలో అవ్వాలి.
లోకల్‌గా ఏమైనా గొడవలు జరిగితే వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే అవసరానికి లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోండి. స్నానానికి నీటిలోకి దిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈతరానివారు.. మరింత జాగ్రత్తగా ఉండాలి. తొక్కిసిలాట జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. తడికి కాలు జారిపోకుండా.. గ్రిప్నిచ్చే చెప్పులు, షూలు ఎంచుకుంటే మంచిది. ఇవన్నీ ఫాలో అవుతూ.. రెగ్యులర్ అప్డేట్స్తో మీరు ట్రిప్‌ని సేఫ్‌గా ముగించుకోవచ్చు.
Also Read : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే