అన్వేషించండి

RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు

RK Roja Makar Sankranti celebration | కూటమి ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరని, ఏపీ ప్రజల కష్టాలు మంటల్లో కాలిపోయి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

Andhra Pradesh News | హైదరాబాద్: ఏపీ ప్రజలకు, తెలుగు వారికి ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా (RK Roja) భోగి శుభాకాంక్షలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి సంక్రాంతి లాంటి పండుగులు జరుపుకోవడం వల్ల మనకు తెలియని, దూరపు బంధువులు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు. నగరిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి భోగి మంటలు వేసి పండుగ జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల భవిష్యత్ తరాలకు మన పండుగ, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని రోజా పేర్కొన్నారు. తెలుగు ప్రజలు భోగ భాగ్యాలతో, ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సుఖశాంతులతో సంతోషంగా రోజా ఆకాంక్షించారు.

ఏపీలో ఎవరూ సంతోషంగా లేరన్న రోజా
గతంలో వైసీపీ పాలనలో సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలు బాధతో ఉన్నారని రాష్ట్రం మొత్తం కళ్లారా చూస్తోంది. నగరి నియోజకవర్గంలోనూ ప్రజలు సంతోషంగా లేరు. గతంలో వైసీపీ పాలనలో కొత్త బట్టలు ధరించి, పిండి వంటలు, భోగి మంటలతో సంతోషంగా పండుగ జరుపుకునేవారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేయలేదు. దాంతో సంక్రాంతి వచ్చినా ఏ కుటుంబంలోనూ సంతోషం కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసింది. సంక్రాంతి అంటే రైతుల పండుగ, కానీ ఈ పండుగ నాడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు.

 

భోగి పండుగరోజు భోగి మంటల సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. కరెంట్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు మరింత నష్టపోతున్నారు. దాంతో కూటమి 7 నెలల పాలనలో చీకట్లు నెలకొన్నాయి. ఈ భోగి మంటలతోనైనా వారి కష్టాలు తొలగిపోవాలని, వారి జీవితాల్లో వెలులు నిండాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. 

Also Read; Vangalapudi Anitha Bhogi Celebrationa: భోగి వేడుకల్లో పాల్గొన్న వంగలపూడి అనిత, కూతురితో పోటీపడి మరీ డ్రమ్స్ వాయిస్తూ సందడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Embed widget