Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
Daaku Maharaj Day 1 Collections: ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ బాలయ్య థియేటర్ లో సందడి చేసేందుకు వచ్చేసాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Daaku Maharaj First Day Collections: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించి లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కోల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య అభిమానుల కోసం బాబీ ఈ సంక్రాంతికి అదిరిపోయే మాస్ మసాలా మూవీ అందించారంటున్నారు. అక్కడక్కడ సినిమా లాగ్ అనిపించిన, ఫస్టాఫ్ ఆడియన్స్ ఊహకు అందేలా ఉన్నప్పటికీ బాలయ్య వైల్డ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉందని, యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి 'డాకు మహారాజ్'కు తొలి రోజే హిట్ టాక్ పడింది. దీంతో మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి.
ఫస్ట్ డే యూఎస్ బాక్సాఫీసు షేక్
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ ఇచ్చిన 'డాకు మహారాజ్', ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులిపింది. అమెరికాలో బాక్సాఫీసు వద్ద తొలి రోజు బాలయ్య అరుదైన ఘనత సాధించారు. ఫస్ట్ డే మిలియన్ డాలర్లు వసూళ్ల సాధించి యూఎస్ బాక్సాఫీసును షేక్ చేసింది. తాజాగా ఈ విషయాన్ని మూవీ టీం అధికారంగా ప్రకటించింది. అమెరికాలో 'డాకు మహారాజ్' వన్ మిలియన్ డాలర్లు క్రాస్ చేసింది. ఇప్పటికీ ఆ సంఖ్య పెరుగుతూ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది అంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. ఈ మేరకు వన్ మిలియన్ లు క్రాస్ చేసిన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
#DaakuMaharaaj crosses $1M+ Gross in the USA and continues its BLOCKBUSTER HUNTING spree! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025
This is just the start of NBK’s storm! 🦁#BlockbusterHuntingDaakuMaharaaj 🔥
USA Release by @ShlokaEnts
Overseas Release by @Radhakrishnaen9
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/82Kkd5ZnHN
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు..
ఇక డాకు మహారాజ్ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి మొత్తం రూ. 22.31 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ ఒపెనింగ్ ఇచ్చింది. ఏరియా వైస్ గా డాకు మహారాజ్ కలెక్షన్స్ చూస్తే.. నిజాంలో రూ. 4.07 కోట్లు, సీడెడ్ 5.25కోట్లు, ఉత్తరాధ్ర రూ. 1.92 కోట్లు, గుంటూరు రూ. 4 కోట్లు, కృష్ణ రూ. 1.86 కోట్లు, తూరు గోదావరి రూ. 1.95 కోట్లు, వెస్ట్ గొదావరి రూ. 1.75 కోట్లు, నెల్లూరు రూ. 1.51 కోట్లుగా వసూళ్లు ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే వీటిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:నోరు జారిన నక్కిన... అన్షుపై అనుచిత వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి - బన్నీని ట్రోల్ చేసేలా...కథ ఏంటంటే
'డాకు మహారాజ్'ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొదించాడు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర పోషించాడు. కొందరు రౌడీలు ఓ చిన్నారి చంపాలని చూస్తారు. ఓ చిన్నారి ప్రమాదంలో ఉందని నానాజీ ఫోన్ వస్తుంది. దాంతో ఆ చిన్నారిని విలన్ల నుంచి కాపాడతాడు. మూడు సార్లు ఆ చిన్నారిని కాపాడిన క్రమంలో విలన్ల గ్యాంగ్ కి చెందిన ఓ వ్యక్తి బల్వంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) కి ఫోన్ చేసి తాను డాకు మహారాజ్ చూశానని చెబుతాడు. అసలు డాకు మహారాజ్ ఎవరూ? ఆయన నానాజీగా ఎందుకు మారారు? అనేది ఇక్కడ ట్విస్ట్. మొదట సివిల్ ఇంజనీర్ అయిన సీతారాం... 'డాకు మహారాజ్'గా ఎందుకు మారాడు? అక్కడ ఠాకూర్ (బాబీ డియోల్) ఫ్యామిలీకి శత్రువు ఎందుకు అయ్యాడు? డాకు మహారాజ్ నుంచి నానాజీ ఎందుకు పేరు మార్చుకున్నాడ? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఉర్వశీ రౌతేలె స్పెషల్ సాంగ్ తో పాటు పలు సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. తమన్ సంగీతం అందించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

