Daaku Maharaaj Review Live Updates: బాలకృష్ణ 'డాకు మహారాజ్' రివ్యూ లైవ్ అప్డేట్స్ - సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి
Daaku Maharaaj Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' నేడు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి రివ్యూ లైవ్ అప్డేట్స్...

Background
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఆయన వీరాభిమానులలో ఒకరు అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన సినిమా 'డాకు మహారాజ్' (Daaku Mahaaraj). శ్రీకర స్టూడియో సమర్పణలో మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ నిర్మించిన చిత్రమిది. దీనికి బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించారు.
Daaku Mahaaraj Release Date: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'డాకు మహారాజ్' ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పటి వరకు ఆయన డ్యూయల్ రోల్ చేసిన మెజారిటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో భారీ అంటే భారీ సక్సెస్ సాధించాయి. సంక్రాంతి సందర్భంగా వచ్చిన బాలయ్య సినిమాల సక్సెస్ రేట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ. ఈ రెండు సెంటిమెంట్లకు తోడు సినిమా ట్రైలర్లు, పాటలు వైరల్ కావడం - ప్రామిసింగ్ అని ప్రేక్షకులలో నమ్మకం కలిగించడంతో జనాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'డాకు మహారాజ్' సినిమాకు తమన్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణతో ఆయనది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'అఖండ'తో పాటు పలు సినిమాలకు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి థియేటర్లలో పూనకాలు వచ్చాయని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలు కో కొల్లలు. ఇక ఇటీవల జరిగిన రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ చూస్తే... డాకు సాంగ్ ప్లే చేసిన సమయంలో స్పీకర్లు కింద పడ్డాయి. బాలయ్యతో కాంబినేషన్ సినిమా అంటే కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోవాలని తమన్ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Also Read: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
Daaku Mahaaraj Cast and Crew: 'డాకు మహారాజ్' సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు ప్రగ్యా జైస్వాల్ నటించారు. 'అఖండ'లో తొలిసారి బాలకృష్ణ సరసన ఆవిడ నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా కాకుండా 'అఖండ' సీక్వెల్ కూడా ఆవిడ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం చేయడంతో పాటు కీలక సన్నివేశాలలో కనిపించనున్నారు. చాందిని చౌదరి స్పెషల్ రోల్ చేశారు. అయితే ఆవిడను ప్రచార చిత్రాలలో ఎక్కడా చూపించలేదు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ రోల్ చేసిన ఈ సినిమాలో రవికిషన్ సైతం ఒక పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఏపీలో ఉదయం నాలుగు గంటలకు షో పడుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో లైవ్ అప్డేట్స్ రీడర్స్ కోసం...
'డాకు మహారాజ్' చూసిన ఆడియన్స్ ఏమన్నారు?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం బాలకృష్ణ అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ నుంచి 'డాకు మహారాజ్'కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్స్, ఏపీలో కొంత మంది ఉదయం నాలుగు గంటల షోలు చూసిన జనాలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూడటం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
డాకు మహారాజ్ డీటెయిల్డ్ రివ్యూ
'డాకు మహారాజ్' సినిమా మీద ఏబీపీ దేశం డీటెయిల్డ్ రివ్యూ కోసం... కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
Also Read: డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?





















