Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Kiara Advani announce pregnancy with cute photo: హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతున్నారు. భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.

హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తల్లి కాబోతున్నారు. ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్. ఆ విషయాన్ని భర్త సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ఆవిడ అందరికీ చెప్పారు.
మా జీవితాలలో గొప్ప బహుమతి
Kiara Advani Pregnant News: ఇటు కియారా అద్వానీ గానీ, అటు సిద్ధార్థ్ మల్హోత్రా గానీ ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. ''మా జీవితాలలో గొప్ప బహుమతి. త్వరలో వస్తుంది'' అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. సిద్ధార్థ్ చేతుల్లో కియారా చేతులు ఉన్నాయి. ఆమె చేతుల్లో చిన్నారి వేసుకునే సాక్సులు ఉన్నాయి. దాంతో విషయం అందరికీ అర్థమైంది. వాళ్ళిద్దరికీ పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
'షేర్షా' చిత్రీకరణలో ప్రేమ... తర్వాత పెళ్లి!
Kiara Advani and Sidharth Malhotra love story: తమిళ దర్శకుడు, తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా 'పంజా' సినిమా తీసిన విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'షేర్షా'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల అయింది. నాలుగేళ్ల క్రితం... 2021లో విడుదలైన ఆ సినిమాలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ... చిత్రీకరణ మొదలైంది మాత్రం 2020లో. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డేటింగులో ఉన్నారని బాలీవుడ్ వర్గాలలో వినిపించింది. అయితే వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేయలేదు.
ఫిబ్రవరి 7, 2023లో హిందూ సంప్రదాయం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ నగరంలో కియారా, సిద్ధార్థ్ వివాహ బంధంతో ఒకటి అయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లికి ఓ ఏడాది ముందర 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కరణ్ జోహార్ వాళ్ళిద్దరి డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
Also Read: 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
తెలుగులో మహేష్, చరణ్ సినిమాలలో...
బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా అద్వానీ తెలుగులో కూడా సినిమాలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో ఆవిడ నటించారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ', ఇటీవల వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమాలలో కియారా సందడి చేశారు. మరోవైపు హిందీలో కూడా ఆవిడ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడం వల్ల సినిమాలకు కొన్ని రోజులు విరామం ఇవ్వనున్నారని సిద్ - కియారా సన్నిహితులు తెలుపుతున్నారు.
Also Read: అగత్యా రివ్యూ: భయానికి, వినోదానికి మధ్య సంఘర్షణ... తమిళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?





















