News
News
X

IIT Guwahati : పండ్లు, కూరగాయలకు ఆ రసం పూస్తే కుళ్లిపోవు - ఐఐటీ గౌహతి పరిశోధకుల సూపర్ డిస్కవరీ !

వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యంగా పండ్లు, కూరగాయాలకు నిల్వ పెద్ద సమస్య. కోత పూర్తయిన నాలుగైదు రోజుల్లో అమ్ముకోకపోతే వృధా అయిపోతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించే మార్గాన్ని ఐఐటీ గౌహతి పరిశోధకులు కనుగొన్నారు.

FOLLOW US: 

IIT Guwahati  :  యాపిల్స్ కొన్నా.. టామాటాలు కొన్నా ఎంత  ఫ్రిజ్‌లో దాచుకున్నా వారం రోజులు మాత్రం కాపాడుకోగలం. అప్పటికీ వాడకపోతే వాటిని పడేయాలి. కేజీ.. అర కేజీ కొనే సామాన్యులే ఇలాంటి  పరిస్థితి చూసి  బాధపడతారు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొంటున్నవి మరి. అలాంటిది .. పండించే రైతులకు ఎలా ఉండాలి. ఆరు గాలం శ్రమించి పండించే రైతులు.. పంట చేతికి అందిన తర్వాత వెంటనే అమ్మేసుకోవాలి. లేకపోతే అవి పండిపోవడం.. కుళ్లి పోవడం వంటివి జరుగుతాయి. రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని దళారులు వారి వద్ద తక్కువకే కొని మార్కెట్లో ఎక్కువకు అమ్ముకుని రైతుల కన్నా ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని మార్చడానికి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి ఓ కొలిక్కి వస్తున్నాయి. 

వ్యవసాయ రంగంలో వృధాను తగ్గించేందుకు  పరిశోధకుల ప్రయోగాలు సక్సెస్ 

ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు ఫ్రూట్స్ మీద..  కూరగాయల మీద పూసే ఓ రకమైన ఎడిబుల్ కెమికల్ తయారు చేశారు. ఇది చెరకు పిప్పి నుంచి  తయారు చేస్తారు. ఈ ఎడిబుల్ కెమికల్ ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయలేదు. కానీ ఈ కెమికల్‌ను పూయడం వల్ల ఫ్రూట్స్  కానీ కూరగాయలు కానీ.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ పాడవకుండా ఉంటాయి. కనీసం రెండు నెలల పాటు వాటి తాజాదనం తగ్గని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడయింది. ఈ పరిశోధనల వివరాలను ఐఐటీ గౌహతి ప్రకటించింది. పరిశోధకులు సిద్ధం చేసిన ఎడిబుల్ కెమికల్ ఏ మాత్రం హానికరం కాదని.. అది తినుబండాల వేస్ట్ నుంచి తయారు చేసిందేనని ప్రకటించారు. 

స్టెయినబుల్ డెలవప్‌మెంట్  గోల్  పరిశోధనలకు ఫలితం

వ్యవసాయరంగంలో పంట వృధాను తగ్గించడానికి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, సప్లయ్ వంటి విషయాల్లో వ్యవసాయ ఉత్పత్తుల వేస్టేజీని.. నష్టాన్ని నివారించడానికి సస్టెయినబుల్ డెలవప్‌మెంట్  గోల్ పేరుతో పరిశోధనలు చేస్తున్నారు. భారత్‌లో ఇలా వ్యవసాయ రంగంలో కనీసం 15.9 శాతం వరకూ వేస్టేజీ ఉందని  రికార్డులు చెబుతున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్నెస్, ఫుడ్ కెమిస్ట్రీ, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ఫుడ్ సైన్స్ అంట్ టెక్నాలజీ వంటి అంతర్జాతీయ మ్యాగజైన్లలోనూ ప్రచురించారు. 

పూర్తి స్థాయి పరిశోధనల తర్వాత అందుబాటులోకి !

పూర్తి స్థాయి పరిశోదనలు చేసిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ గౌహతి ప్రయత్నించే అవకాశం ఉంది.  ఇప్పటి వరకూ  వచ్చిన ఫలితాలు సంతృప్తి కరంగా ఉండటంతో  ప్రయోగాల్ని మరింత విస్తృత  పరుస్తున్నారు. ఐఐటీ గౌహతి స్మార్ట్ ఇండియా హ్యాకధాన్‌కు నోడల్ ఎజెన్సీగా ఉంటోంది. కొన్ని ఇతర కార్యక్రమాలనూ చేపడుతోంది. వినూత్నమైన ఉత్పత్తులు కనిపెట్టడంలో .. ఐఐటీ గౌహతి పరిశోధకులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

శృంగారం చేసే ముందు ఆధార్, పాన్ చెక్ చేయక్కర్లేదన్న ఢిల్లీ హైకోర్టు - ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ !

Published at : 30 Aug 2022 06:52 PM (IST) Tags: IIT Guwahati Edible Coating Vegetable Storage Time Technology News

సంబంధిత కథనాలు

Karnataka: ఉరేసుకున్న ట్రైనీ- ఆరుగురు IAF అధికారులపై మర్డర్ కేసు!

Karnataka: ఉరేసుకున్న ట్రైనీ- ఆరుగురు IAF అధికారులపై మర్డర్ కేసు!

Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?

Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Congress President Elections: కాంగ్రెస్ నూతన అధ్యక్ష్యుడు, గాంధీ కుటుంబేతరుడు - పదవి చేపట్టాలంటే ఈ అర్హతలు తప్పనిసరి

Congress President Elections: కాంగ్రెస్ నూతన అధ్యక్ష్యుడు, గాంధీ కుటుంబేతరుడు - పదవి చేపట్టాలంటే ఈ అర్హతలు తప్పనిసరి

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం