CM Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ
CM Mamata Banerjee: బంగాల్‌ను విభజించాలని వస్తున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.
CM Mamata Banerjee: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ భాజపా నేతలు చేస్తోన్న డిమాండ్లపై ఫైర్ అయ్యారు. తన రక్తం చిందించైనా బంగాల్‌ను ముక్కలు కాకుండా కాపాడతానని దీదీ అన్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఇటీవల
బంగాల్ ప్రభుత్వం ఇటీవల మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న వేళ బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మేరకు బంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రకటించారు.
Also Read: Monkeypox Cases: మంకీపాక్స్ వైరస్‌పై WHO హెచ్చరిక- 27 దేశాల్లో 780 కేసులు