Monkeypox Cases: మంకీపాక్స్ వైరస్‌పై WHO హెచ్చరిక- 27 దేశాల్లో 780 కేసులు
Monkeypox Cases: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
Monkeypox Cases: ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మే 13 నుంచి జూన్ 2 వరకు 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.
Latest #monkeypox disease outbreak news.
— World Health Organization (WHO) (@WHO) June 5, 2022
Since 13 May 2022 & as of 2 June 2022 - 780 laboratory-confirmed cases of monkeypox have been reported to or identified by WHO from 27 Member States across four WHO regions, not endemic to the monkeypox virus.
📌https://t.co/tlMXE4RWP9 pic.twitter.com/KpwrHz5He7
వేగంగా వ్యాప్తి
ప్రపంచవ్యాప్తంగా మే 13 నాటికి మంకీపాక్స్ వైరస్ కేసులు 257 బయటపడ్డాయి. అయితే ఆ తర్వాత నుంచి ఈ నెల 2 వరకు 780 కేసులు నిర్ధరణయ్యాయి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో మంకీపాక్స్ వల్ల 7 దేశాల్లో 66 మంది మృతి చెందారు.
భారత్‌లో
దేశంలో కూడా మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మంకీపాక్స్ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్ సేకరించి పుణేలోని ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.
1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట
అమ్మవారిలాగే...
చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.
Also Read: Leopard Attacks Pet Dog: నక్కినక్కి కుక్కపై దాడి చేసిన చిరుత- వీడియో వైరల్
Also Read: Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,714 కరోనా కేసులు- ఏడుగురు మృతి