చందమామపై డ్రిల్లింగ్, చంద్రయాన్- 4, 5, 6 ప్రయోగాలు వేరే లెవెల్, భారీగా ప్లాన్ చేస్తోన్న ఇస్రో
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ నాలుగు దశల్లో ప్లాన్ చేశారు. మొదటి దశ లో చంద్రయాన్ 1 ను ప్రయోగించారు. 2008లో చంద్రయాన్ 1 ప్రయోగం జరిగింది.
ఆర్టెమిస్ ప్రోగ్రాం లక్ష్యం చంద్రుడి మీదకు మనుషులు పంపించటం..చంద్రుడిని ఓ గేట్ వే టూ ది స్పేస్ గా తయారు చేయటం. అంటే భవిష్యత్తులో మనుషులు చేసే ప్రయోగాలకు భూమి కాకుండా చంద్రుడిని హాల్ట్ పాయింట్ గా మార్చటం. ఫైనల్ టార్గెట్ మిషన్ టూ మార్స్. మిషన్ టూ మార్స్ గురించి తర్వాత వీడియోల్లో చెప్పుకుందాం. ఆర్టెమిస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
2022 నవంబర్ లో ఆర్టెమిస్ 1 ప్రయోగం జరిగింది. SLS రాకెట్ ద్వారా ఓరియాన్ క్యాప్య్సూల్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. అది చంద్రుడు చుట్టూ తిరుగుతూ అనేక ఫోటోలు విలువైన ఇన్ఫర్మేషన్ సేకరించి తిరిగి భూమి మీదకు వచ్చింది. ఆర్టెమిస్ 2 లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెడతారు. చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేసి మళ్లీ వీళ్లు కూడా భూమి మీదకు తిరిగి వచ్చేస్తారు. ఈ ఆర్టెమిస్ 2 ను 2024లో అంటే నెక్ట్స్ ఇయర్ ప్రయోగించాలని నాసా ప్లాన్. ఇక ఆర్టెమిస్ 3 లో మనుషులు చంద్రుడి కక్ష్యలో తిరిగి వచ్చే యటం కాదు...చంద్రుడి మీద ల్యాండ్ అవుతారు...దాదాపు యాభై మూడేళ్ల తర్వాత..ఇది 2025లో చేయాలని నాసా ప్లాన్. ఆర్టెమిస్ 4 కూడా ప్లాన్ చేశారు దీంట్లో చంద్రుడి చుట్టూ లూనార్ గేట్ వే పేరుతో ఓ స్పేస్ స్టేషన్ తిరిగేలా ప్లాన్ చేశారు. ఇది 2028లో చేస్తారు.
సో మొత్తం దశల వారీగా మనుషులను చంద్రుడి మీద దింపాలి..చంద్రుడి చుట్టూ తిరిగేలా ఓ స్పేస్ స్టేషన్ ను నిర్మించాలి. సో దట్ అది చంద్రుడి మీద రాకపోకలకు ఓ కేంద్రంగా పనిచేస్తుంది. క్లియర్ కదా.
ఇప్పుడు చంద్రయాన్ గురించి మాట్లాడుకుందాం
మన ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ నాలుగు దశల్లో ప్లాన్ చేశారు. మొదటి దశ లో చంద్రయాన్ 1 ను ప్రయోగించారు. 2008లో చంద్రయాన్ 1 ప్రయోగం జరిగింది. ఓ ఇంపాక్టర్ ప్రోబ్ చంద్రుడి మీద ఖనిజాలు ఏం ఉన్నాయో మ్యాప్ రెడీ చేసింది. దీన్నే మూన్ మినరాలజీ మ్యాపింగ్ అంటారు. సో దీని ద్వారా చంద్రుడి మీద వాటర్ కంటెంట్ ఉండేందుకు అవకాశం ఉందని చెప్పింది ఇస్రోనే.
ఫేజ్ 2 : సాఫ్ట్ ల్యాండర్స్ అండ్ రోవర్స్ ని చంద్రుడి మీద ఇస్రో ప్రయోగిస్తోంది. అందులో భాగంగానే 2019లో చంద్రయాన్ 2 ను ప్రయోగించారు. చంద్రుడి మీద ఓ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అందులో నుంచి ఓ రోవర్ ను బయటకు తీసుకువచ్చి చంద్రుడి సౌత్ పోల్ మీద ప్రయోగాలు చేయాలని. కానీ ఇది ఫెయిల్ అయ్యింది. అందుకే ఇదే పనిని మళ్లీ చేయటానికి 2023 జులై 13న మళ్లీ చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. లాంఛ్ వెహికల్ మార్క్ 3 M4 ద్వారా చంద్రుడి మీద ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి రోవర్ ను నడిపించాలనేది ప్రస్తుతం నాసా ముందున్న లక్ష్యం
ఫేజ్ 3 : చంద్రుడి మీద శాంపుల్స్ ను కలెక్ట్ చేయటం. 2025లో చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడి పై రాత్రి సమయాల్లో బతికేందుకు అవకాశాలు ఎంత వరకూ ఏంటీ..లాంటివి శాంపుల్స్ కలెక్ట్ చేయటం చంద్రయాన్ 4 టార్గెట్.
ఫేజ్ 3 లోనే చంద్రయాన్ 5 ప్రయోగం కూడా చేయాలనేది ప్లాన్. ఇది 2025-30ల మధ్యలో చేయాలనేది ఇస్రో టార్గెట్. చంద్రుడి మీద ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేసి శాంపుల్స్ టెస్ట్ చేయాలనేది మిషన్.
ఇక ఫేజ్ 4 : ఫేజ్ 4 లో భాగంగా 2030-35 మధ్యలో చంద్రయాన్ 6 ను ప్రయోగించి ఈ సేకరించిన శాంపుల్స్ ను భూమి మీదకు తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ అన్న మాట.
సో నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో 4 ఆర్టెమిస్ ప్రయోగాలు జరిగితే..ఇస్రో చంద్రయాన్ మిషన్ లో ఆరు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్టెమిస్ టార్గెట్ అంతా చంద్రుడి మీద హాల్ట్ పాయింట్స్ ఏర్పాటు, స్పేస్ స్టేషన్ ఏర్పాటు...అక్కడి నుంచి మార్స్ మీదకు ప్రయాణం చేసేందుకు అవకాశాలును ఏర్పాటు చేసేది అయితే...ఇస్రో చేస్తున్న చంద్రయాన్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా సాగుతోంది. ఆర్టెమిస్ కమర్షియల్ ప్రోగ్రాం. చంద్రయాన్ కూడా కమర్షియలే అయినా రీసెర్చ్ ఓరియెంటెడ్. ఆర్టెమిస్ లో నాసా తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి దేశాలతో పాటు భారత్ లాంటి దేశాలు కూడా ఆర్టెమిస్ అకార్డ్స్ గా ఉన్నాయి. ఇస్రో మాత్రం జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా సహాయాన్ని మాత్రమే చంద్రయాన్ ప్రయోగాల కోసం తీసుకుంటుంది. సో ఇవి చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తున్న నాసా, ఇస్రో మిషన్ ల కథ