
Breaking News Live Telugu Updates: మర్రి శశిధర్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
మర్రి శశిధర్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు
మాజీ మంత్రి, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలిలో విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి!
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు పిల్లలు మధ్యాహ్నం ఈతకని వెళ్లి నానక్ రాంగూడ పటేల్ కుంటలో మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారుల వయసు దాదాపు 12 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు షాభాజ్ (15) దీపక్ (12) పవన్ (13) గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఆర్.ఎం.హెచ్.పి డిపార్ట్మెంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కన్వేయర్ బెల్ట్ లు ఒకదానినొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
శబరిమలకు వెళ్తూ లోయలపడ్డ ఏపీ భక్తుల బస్సు
శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 18 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

